ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లస్థలాలను పంపిణీ చేయనున్నట్టు  ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతిలో స్పందనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబరు ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్‌ పూర్తి కావాలన్నారు. అక్టోబరు చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలని అధికారులకు స్పష్టం చేశారు. నవంబర్‌ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకావాలన్న ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని సూచించారు. నవంబర్‌ నాటికి భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు. గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.



డిసెంబర్‌ నుంచి కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే ఉండాలని, రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితా బోర్డులో పెట్టాలన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా ఉండాలని ఆదేశించారు. వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం కింద 5.3 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రూ.560 కోట్లతో  వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. స్క్రీనింగ్‌, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం అధికారులకు వర్క్‌షాపులు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామన్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వర్క్‌షాపు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తమ సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, ఆ వినతులు ఇచ్చేవారి స్థానంలో మనం ఉంటే.. ఎలా ఆలోచిస్తామో.. అదే రీతిలో మనం స్పందించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అప్పుడే స్పందనకు ఆర్థం ఉంటుందన్నారు.





ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు మరింత మానవీయ దృక్పథంతో వినతులకు పరిష్కారం చూపాలన్నారు. దీనికోసమే ఈ వర్క్‌షాపును ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈనెల 24, 27 తేదీల్లో వర్క్‌షాపులను నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబరులో జిల్లాల స్థాయిలో రెండురోజులపాటు వర్క్‌షాపులు జరుగుతాయన్నారు. దిగువస్థాయి అధికారులకు మరింత మోటివేషన్‌ పెంచడమే దీని ఉద్దేశ్యమన్నారు. కలెక్టర్లు కూడా ఈ వర్క్‌షాపులో పాల్గొనాలన్నారు. నవంబర్‌ నెల నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని చెప్పారు. గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.




కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు నుంచి ఇవ్వాలని చెప్పారు. అక్టోబరు, నవంబరు నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ అందుబాటులోకి రాగానే అక్కడే డిస్‌ప్లే ఉండాలన్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితాను బోర్డులో పెట్టాలన్నారు. ఇళ్లపట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పెట్టాలని సూచించారు. ఈ జాబితామీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, పథకం ఎవ్వరికీ అందకపోయినా ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదేనాని స్పష్టం చేశారు. 



నవంబర్‌ నెల నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని చెప్పారు. గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

నవంబర్‌ నెల నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని చెప్పారు. గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: