ఎవరు ఎన్ని చెప్పినా సరే టీం ఇండియా బ్యాటింగ్ కి కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్నుముఖ. ఈ విషయం అందరికి తెలుసు. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్ కూడా దాదాపు గెలిచింది. దీనితో కోహ్లీ టీం లో లేకపోతే మాత్రం జట్టు గెలవడం చాలా కష్టమనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఏంటీ అంటే ఈ మధ్య కాలంలో కోహ్లీ హవా అనేది దాదాపుగా తగ్గింది అనే చెప్పాలి. 

 

మూడు నాలుగు నెలల నుంచి అతని బ్యాట్ నుంచి వచ్చిన సరైన ఇన్నింగ్స్ అనేది లేకుండా పోయింది. దీనితో ఇప్పుడు అతని మీద ఒత్తిడి పెరిగింది అంటున్నారు. వాస్తవానికి కోహ్లీ మానసికంగా గట్టిగా ఉండే వ్యక్తి. అయినా సరే అతను మాత్రం ఈ విధంగా ఒత్తిడికి గురి అవ్వడం అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కెప్టెన్ గా అతన్ని తప్పించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. 

 

ఇటీవల అతను రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా కొందరు కామెంట్ చేసారు. అయితే కోహ్లీ మాత్రం మానసికంగా ధృడంగా ఉండే వ్యక్తి కాబట్టి రాబోయే సీరీస్ లో కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. సౌత్ ఆఫ్రికా సీరీస్ లో అతను ఆడకపోతే కచ్చితంగా కెప్టెన్ గా తప్పిస్తారని కొందరు సోషల్ మీడియాలో అనవసర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరి సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: