ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ గురించి ప్రతేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బ ఐపీఎల్ 2020 సీజన్ పై పడింది. నిజానికి నిన్నటి వరకు ఏమి జరిగిన ఐపీఎల్ 2020 సిరీస్ నిర్ణయించ తేదీలకే జరుగుతుందని  భారత క్రికెట్ నియంత్రణ మండలి ఛైర్మెన్ సౌరబ్ గంగూలీ ప్రకటించాడు. కానీ నేడు సీన్ కట్ చేస్తే సీజన్ వాయిదా..! కాకపోతే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ - 2020 సీజన్ మ్యాచ్‌లు మొదలు కావాల్సి ఉండగా, దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తితో  ఐపీఎల్‌ని వాయిదా వేశారు. దీనితో ఈ సీజన్ ఏప్రిల్ 15 తర్వాత మొదలు కావచ్చని వార్తలు వస్తున్నాయి.

 

 


నిజానికి ఐపీఎల్‌ మ్యాచ్‌ లు అన్నిటికీ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే పర్యాటక వీసాల్ని నేటి నుంచి రద్దు చేయడంతో విదేశీ ప్లేయర్లు భారత్‌ కి వచ్చి ఐపీఎల్‌ లో ఆడటంపై చెప్పలేని స్థితి నెలకొంది. కాబట్టి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌ల నిర్వహణకి ఓకే చెప్పిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, కాకపోతే విదేశీ క్రికెటర్లని మాత్రం అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వీసాల సడలింపునకి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఐపీఎల్‌ ని వాయిదా వేయడం ఒక్కటే ప్రత్యామ్నాయం మార్గం బీసీసీఐ ముందు ఉండడంతో ఈ ఐపీఎల్ 2020 సిరీస్ ని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారిగా తెలిపింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: