ప్రస్తుతం శ్రీలంక వేదికగా ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్  హోరాహోరీగా జరుగుతుంది. అయితే టెస్ట్ మ్యాచ్ అంటే  ఆటగాళ్లు ఎంతో ఆచితూచి ఆడుతూ ఉంటారు.. కానీ ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు వీరవిహారం చేసేస్తున్నారు. సిక్సర్లు  ఫోర్లతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్   కొట్టిన భారీ సిక్స్త్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అంతలా హాట్ టాపిక్గా  మారిపోవడానికి ఈ సిక్సర్ ప్రత్యేకత ఏమిటో తెలుసా.. ఆ బంతి స్టేడియం బయట ఉన్న రోడ్డు పై పడింది.


 ఇక పాట్ కమ్మిన్స్ కొట్టిన ఈ భారీ సిక్సర్ ఆటగాళ్లతో పాటు అటు ప్రేక్షకులను కూడా విస్మయానికి గురిచేసిందని చెప్పాలి. ఇక ప్రేక్షకులందరూ నోరెళ్ళబెట్టి ఇదేం బాదుడు రా బాబు అంటూ మనసులో అనుకున్నారు. అయితే ఇక ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పాట్ కమ్మిన్స్  ఆడిన ఇన్నింగ్స్ కూడా ఏకంగా టి20 ఫార్మర్ తరహా లోనే ఉంది అని చెప్పాలి. ఆచితూచి ఆడకుండా ఏకంగా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేశాడు. ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయాడు. అందులోనే ఈ భారీ సిక్సర్ కూడా ఉండటం గమనార్హం.


 ఇక పోతే ఇక ఈ స్టార్ ప్లేయర్ అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈ ఏడాది కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ సీజన్ లోను మెరుపు ఇన్నింగ్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.  ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి  ఔరా అనిపించాడు పాట్ కమ్మిన్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్గా కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు అని తెలుస్తోంది. ఏదేమైనా ఈ భారీ సిక్సర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: