ఇటీవల కాలంలో టీమిండియాలో పలువురు ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చిన సమయంలో ప్రాక్టీస్ లో భాగంగా గాయం బారినపడిన కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో చేరాల్సి ఉంది. అయినప్పటికీ అతను కరోనా వైరస్ బారిన పడటంతో మరోసారి జట్టుకు దూరమయ్యాడు. అయితే వన్డే సిరీస్కు దూరమైన కేఎల్ రాహుల్ ఇక వైరస్ నుండి కోలుకోక పోవడంతో ఇక టీ20 సిరీస్  కు కూడా దూరమయ్యాడు అన్నది తెలుస్తుంది.


 అయితే ఇప్పటికే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో అదరగొట్టి 3-0  తో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. కాగా నేడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. టి20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం జట్టులో స్టార్ ఆల్రౌండర్ లో కొనసాగుతున్న రవీంద్ర జడేజా టీ20 సిరీస్ కి కూడా దూరం కాబోతున్నాడట. వెస్టిండీస్తో తొలి వన్డే మ్యాచ్కు ముందు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా జడేజా గాయం బారిన పడ్డాడు.


 దీంతో మొదటి మ్యాచ్ తర్వాత అతడు జట్టుతో కలుస్తాడు అనుకున్నప్పటికీ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడట. ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని బిసిసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నేటి నుంచి ప్రారంభం కాబోయే టి20 సిరీస్ కు రవీంద్ర జడేజా అందుబాటులో ఉండటంపై సందేహం నెలకొంది అని తెలుస్తోంది. జడేజా స్థానంలో జట్టులో అవకాశం దక్కించుకున్న అక్షర్  పటేల్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. జడేజా దూరమైతే ఇక టీ20 సిరీస్ కు కూడా జడ్డు స్థానంలో అక్షర పటేల్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: