సాదారణంగా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితం గా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని హెల్మెట్లను తప్పనిసరిగా వాడాలని పోలీసులు అంటున్నారు. మిగితా పెద్ద వాహనాలలో వెళ్లేవారికి మాత్రం హెల్మెట్ తో పని లేదు.. కేవలం సీటు బెల్ట్ తప్పనిసరి అని అంటున్నారు.. అయితే ఇప్పుడు ఒక విచిత్రం జరిగింది. కారులో వెళ్తున్న ప్రయాణికుడొకరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఇదేంటి అనుకుంటూన్నారా? కాస్త వివరంగా తెలుసుకుందాము..


వివరాల్లోకి వెళితే..కేరళకు చెందిన అజిత్ అనే ఓ కారు యజమాని కి ఇటీవల ట్రాఫిక్ పోలీసుల నుంచి ఒక చలాన్ వచ్చింది. మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదు. అందుకు మీకు రూ.500 చలాన్ విధిస్తున్నాము. వెంటనే చలాన్ మొత్తాన్ని చెల్లించండి అంటూ చలాన్ పంపించారు పోలీసులు.. దానికి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే అతనికి కేవలం కారు మాత్రమే ఉంది.. కారులో వెళ్లే తనకు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ చలాన్ రావడం పై విస్మయం వ్యక్తం చేశాడు. ఈ విషయం పై స్థానిక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి, రవాణాశాఖ అధికారి దృష్టి కి తీసుకువెళ్లాడు. అయితే దీనిపై కొంత విచారణ జరిపిన అధికారులు తప్పు జరిగిందని భావించారు.


ఎవరికో పడాల్సిన చలాన్ అతనికి తప్పుగా పడిందని పోలీసులు సర్దిచెప్పడం తో అతని సైలెంట్ అయ్యాడు. చలాన్ ను రద్దు చేసిన అధికారులు తిరిగి ద్విచక్రవాహనదారుడికి చలాన్ విధించారు. సదరు ద్విచక్ర వాహనదారుడు.. హెల్మెట్ పెట్టుకున్నా కూడా వెనుక ఉన్న వ్యక్తి పెట్టుకోలేదని చెప్పారు. మొత్తానికి పొలిసులు వివరణ ఇవ్వడం తో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఈ వార్త క్షణాల్లో స్ప్రెడ్ అవ్వడంతో అందరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: