జీవితంలో లక్ష్యం ఉండటం ఎంత అవసరమో ...ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మన వంతు ప్రయత్నం అంటే ప్రదానం. మన ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు రావొచ్చు, ఎన్నో అవాంతరాలు సమస్యలు ఎదురు కావచ్చు. కానీ వాటికి భయపడి నీ ప్రయత్నం ఆగితే...నీ అడుగు తడబడి వెనక్కి తగ్గితే నిన్ను చేతకాని వ్యక్తిలా చూస్తారు. ఈ సమాజం ఎప్పుడు కూడా పట్టుదలతో కృషిచేసి అనుకున్నది సాధించే వారిని, ఒక స్థాయిలో నిలబడిన వారిని గౌరవిస్తుంది, వారికి మాత్రమే విలువ ఇస్తుంది. అంతే కానీ వెనక్కి తగ్గి పిరికి వారిలా వారి ప్రయత్నాన్ని విరమించుకునే వారిని కాదు. అనుకున్న ప్రతి ఒక్కరూ, పట్టుదలతో పయనించిన ప్రతి ఒక్కరు విజయాన్ని అందుకోలేకపోవచ్చు.

కానీ మీ ప్రయత్నానికి కూడా గుర్తింపు లభిస్తుంది.  ప్రతి మనిషి లోనూ గెలవాలనే పట్టుదల ఉంటే అదే మిమ్మల్ని నలుగురిలో గుర్తింపు పొందేలా చేస్తుంది. ఇతరులు ఏమనుకుంటారో వారి దృష్టిలో మనం తక్కువవుతావేమో అని అనుకుని ఆగిపోతే అది మీకు సంతోషాన్ని ఇవ్వదు.  ఇతరుల కోసం నీ నిర్ణయాన్ని మార్చుకుంటే అది ఎన్నటికీ మీకు మంచి చేయదు. ఈ ఒక్కరి కోసమో మీ నిర్ణయాన్ని మీ లక్ష్యాన్ని మార్చుకోండి, వదులుకోకండి. దైర్యంగా ముందుకు నడచి కష్టమైన అన్నిటినీ అధిగమించి అనుకున్నది సాధించండి. సాధన చేస్తే సాధించలేనిది ఏమి లేదంటారు..సాధనకు కాస్త సాహసం దైర్యం తోడైతే మీ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవచ్చు.

ఏ సమయం లోనూ, ఎలాంటి సందర్భం లోనూ వెనక్కి తగ్గకుండా సాహసించి ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చు. సాధించాలనే పట్టుదల ముందు ఏవీ అడ్డు నిలవలేవు. కష్టపడే వారికి ఫలితం తప్పక ఉంటుంది.  సాధించాల‌నే  పట్టుదల, త‌ప‌న‌ మనలో ఉంటే చాలు ప్రపంచాన్ని కూడా జయించవచ్చని ఎంతో మంది నిరూపించి చూపించారు. కాబట్టి గెలుపే మీ లసఖ్యంగా ముందడుగు వేయండి తప్పక విజయం సాధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: