కాకరకాయ దాల్ తయారీలో వాడే పధార్థాలు : కాకరకాయలు :3 అవనూనె : వేపటానికి సరిపడ పెసరపప్పు : పావుకిలో మెంతులు : ¾ చెంచా బిరియాని ఆకు : 3  ఆవాలు : 1 చెంచా ఎండుమిర్చి : 2 నెయ్యి : 3 చెంచాలు  పంచదార : ¾ చెంచా  అల్లం : 1 అంగుళం ముక్క  పసుపు : అర స్పూన్  ఉప్పు : సరిపడ  తయారీ చేయడం ఎలా : ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చివరలు తీసి వేసి చక్రాల్లాగా పల్చటి ముక్కలుగా కట్ చేయాలి. 3చెంచాలు ఆవనూనెను బాండీలో పొయ్యిమీద పెట్టి వేడి చేసి ఆనూనెలో కాకరకాయ ముక్కలను వేసి దోరగా వేపుకోవాలి.  తీసి పక్కన ఉంచాలి. పెసరపప్పు కడిగి సరిపడ నీరు పోసి ఉప్పు, పంచదార పుసుపు వేసి 4 నిమిషాలు ఉడికించాలి. తరువాత ఈ పప్పుకి వేపిన కాకర ముక్కలు వేసి కలపాలి. తరవాత మంట తగ్గించి సిమ్ లో పెట్టాలి. వేరే పొయ్యిమీద బాండీ పెట్టి నెయ్యి వేసి వేడి అయిన తరువాత ఎండుమిర్చి మెంతులు, ఆవాలు వేసి వేపాలి. అవి వేగిన తరువాత అల్లం ముక్కలు చేసి పోపులో వేసి వేపాలి. అవికూడా వేగిన తరువాత ఆ పోపును ఉడుకుతున్న పప్పులో వేసి మరో 2 నిమిసాలు ఉడికించాలి. తరువాత అల్లం పేస్టు వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఈ పప్పు మరీ గట్టిగా ఉండకుండా మధ్యలో కొంచెం నీరు కలిపి ఉడికించాలి. చక్కగా ఉడికిన పప్పను సర్వింగ్ డిష్లోకి తీసి వేడి వేడిగా వైట్ రైస్ లేదా రోటిలలోకి వడ్డించుకోవాలి వీటితో పాటు వేపిన బంగాళదుంప ముక్కలు లేదా వంకాయ ముక్కలు లాంటి వాటితో కలిపి సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: