ఏపీ మంత్రి రోజా.. ఒక్కసారిగా తాను మంత్రిని అన్న విషయం మరిచిపోయారు. ఓ ఫోటో గ్రాఫర్‌గా మారిపోయారు. అందమైన ఫోటోలు తీసి మురిసిపోయారు. అవును.. విజయవాడలో ఈ తమాషా జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ఫోటో ఎగ్జిభిషన్‌ను పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా స్వయంగా ప్రారంభించారు.  అధునాతన సాంకేతికతో రూపొందించిన కెమెరాలను చూసి ముచ్చట పడ్డారు. అంతే .. అక్కడే ఫోటో గ్రాఫర్‌గా మారిపోయారు. మంత్రి రోజా ఈ ప్రదర్శనలో కొన్ని ఫొటోలు తీశారు.


అంతే కాదు.. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. ఒక్క ఫోటోతోనే తాను సినీ హీరోయిన్‌ అయ్యానంటూ పాత కాలాన్ని గుర్తుచేసుకున్నారు. తన ఫోటో చూసి చిత్రాల్లో కథనాయికగా అవకాశం ఇచ్చారని రోజా గుర్తు చేసుకున్నారు. ఒక  ఫోటో గ్రాఫర్ మూడో కన్ను తెరిస్తే ప్రకృతి పరవశిస్తుందని రోజా అన్నారు. గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు హైదరాబాద్‌, బెంగుళూరులో మాత్రమే నిర్వహించేవారని.. ఇప్పుడు విజయవాడలో కూడా నిర్వహించడం బావుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: