ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 340 మంది తీవ్ర అస్వస్థతకు గురయారు. ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. సీఎం జగన్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 
 
విడుదలైన్ స్టేరైన్ గ్యాస్ ప్రమాదకరం అని తెలుస్తోంది. మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ గ్యాస్ ప్రభావం బాధితులపై ఉండే అవకాశం ఉందని సమాచారం. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. స్థానికులు ఈ ఘటనకు కంపెనీనే బాధ్యత వహించాలని చెబుతున్నారు. అనుభవం లేని ఉద్యోగులను నియమించుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని మరికొందరు చెబుతున్నారు. 
 
ఈ గ్యాస్ పీల్చినవారికి మెడడు, నాడీ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కెమికల్ రియాక్షన్ జరగడం వల్లే ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: