మహారాష్ట్రలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా మాట వినే పరిస్థితి ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదనే విషయం అర్ధమవుతుంది. ఇక మహారాష్ట్రలో భారీ ఎత్తున కరోనా వైరస్ బారిన పోలీసులు పడ్డారు. 

 

వెయ్యి మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు మహారాష్ట్ర పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,140 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ఇందులో 862 యాక్టివ్ కేసులు ఉండగా 10 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. 268 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా 55 ఏళ్ళ వయసు దాటిన పోలీసులను విధులకు రావొద్దని ప్రభుత్వం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: