తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా దాదాపు వెయ్యి కేసుల వరకు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణా ఆలయాలను కరోనా కారణంగా మూసి వేస్తున్నారు. అయితే అది నేడు ఒక్క రోజు మాత్రమే. 

 

ఏకదశి పర్వదినం సందర్భంగా భక్తులు ఆలయాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆలయాలను మూసి వేయడం మంచిది అని దేవాదాయ శాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయం, సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని నృసింహుడి ఆలయం తో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ఆలయాలను మూసి వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: