విజయవాడ ఇంద్ర కీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు మూలా నక్షత్రం సందర్భంగా  అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది అని అధికారులు పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కొనసాగుతున్న ఉత్సవాలలో ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా వ్యవహరిస్తున్నారు.

ఎటువంటి రద్దీ లేకుండా క్యూ లైన్ కొనసాగుతుంది అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మూలా నక్షత్రం.. సరస్వతి అలంకరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఉంటుంది. దీనితో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. ఏ విధమైన భద్రతా లోపాలు లేకుండా ప్రతీ ఒక్కటి కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: