అమరావతి విషయంలో ఈ మధ్య కాలంలో మంత్రులు ఏది మాట్లాడుతున్నా సరే కాస్త ఆందోళన ఉంది. అమరావతిలో అసలు నిరసన చేసే వాళ్ళు రైతులే కాదని వైసీపీ నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులు కూడా అప్పుడప్పుడు నోరు పారేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ...  నిజమైన రైతులు మా భూములు ఇమ్మంటారు.. కనుక కాకినాడ సెజ్ రైతులు తిరిగిమ్మని అడిగారు అని అన్నారు.

అమరావతి  లో నిజమైన రైతులు భూములు ఇమ్మని అడగడం లేదు...కోట్లు కుమ్మరించే కార్యక్రమం చెయ్యమని అమరావతి రైతులు అడుగుతున్నారు  అని ఆయన విమర్శించారు. నిజమైన రైతులు భూములు తిరిగి ఇచ్చేయమని 15 ఏళ్లుగా ఎస్ ఇజి రైతులు ఉద్యమం చేస్తున్నారు అని, అమరావతి రైతులు భూములు వెనక్కి ఇచ్చేస్తారేమో అనుకొని...వద్దని ఉద్యమం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు అందరినీ ఉద్దేశించి నేను అనడం లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: