క‌రోనా టీకాతో భార‌త్‌లో తొలి మ‌ర‌ణం సంభ‌వించింది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ క‌మిటీ ధ్రువీక‌రించింది. టీకా తీసుకున్న త‌ర్వాత త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌కు సంబంధించి నిపుణ‌లిచ్చిన నివేదిక‌ను ఇండియాటుడే బ‌య‌ట‌పెట్టింది. టీకా తీసుకున్న త‌ర్వాత మృతిచెందిన 31 మందిలో క‌లిగిన దుష్ప్ర‌భావాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. ఇందులో ఒక వ్య‌క్తి మాత్రం తీవ్ర‌మైన ఎల‌ర్జీవ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించింది. మార్చి ఎనిమిదో తేదీన ఆ వ్య‌క్తి టీకా తీసుకున్నార‌ని, ఆ త‌ర్వాత క‌లిగే తీవ్ర‌మైన ఎల‌ర్జీవ‌ల్ల చ‌నిపోయార‌ని క‌మిటీ తెలిపింది. టీకా తీసుకున్న త‌ర్వాత ఈ త‌ర‌హా రియాక్ష‌న్స్ ఊహించిన‌వేన‌ని, మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు కూడా తీవ్ర‌మైన ఎల‌ర్జీ వ‌చ్చిన‌ప్ప‌టికీ వారిద్ద‌రూ కోలుకున్నారు. వాస్త‌వానికి టీకా తీసుకున్న త‌ర్వాత త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌వ‌ల్ల మ‌రో ముగ్గురు వ్య‌క్తులు కూడా మ‌ర‌ణించార‌ని, కానీ ఒక వ్య‌క్తి మాత్ర‌మే మృతిచెందిన‌ట్లు ప్ర‌భుత్వం చెపుతోంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: