రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. వివిధ జిల్లాలో పర్యటిస్తూ యువతతో ప్రవీణ్ కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలు రావాలని బహుజన రాజ్యం కావాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోకి బహుజన వాదాన్ని తీసుకువెళ్లాలని  పిలుపునిచ్చారు.

అందరినీ బహుజన వాదం వైపు మళ్లించే ప్రయత్నం జరగాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికవొద్దని... తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఉప ఎన్నికల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయకుండా...విద్యా.వ్యవస్థ బలోపేతం చేయడం కోసం ఖర్చు చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి కేసీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రజలకు వైద్యం అందించడం కోసం పెద్ద ఆస్పత్రులను నిర్మించాలని అన్నారు. ఎలాంటి హెచ్చరికలకు తాను భయపడే అవకాశం లేదని స్పష్టం చేశారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తున్నామని ప్రవీణ్ కుమార్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: