కొట్టుకున్నారు.. కొరుక్కున్నారు.. తిట్టుకున్నారు.. క‌త్తులు తీసుకొని న‌రుక్కోక‌పోవ‌డం ఒక్క‌టే మిగిలింది అనుకోవ‌చ్చు మా ఎన్నిక‌ల స‌ర‌ళి ప‌రిశీలిస్తే. ప్ర‌కాష్‌రాజ్ చేతికి ఇంకా సీసీటీవీ పుటేజ్ రాలేదు. అది వ‌స్తే ఏంచేస్తారో ఆయ‌న‌కే తెలియాలి. బ‌హుశా కోర్టుకు వెళ‌తార‌ని ఆయ‌న ప్యానెల్ త‌ర‌ఫున చెందిన‌వారే చెబుతున్నారు. విష్ణు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందే కోర్టుకు వెళ్లివుంటే ఉప‌యోగం ఉండేది. ఇప్పుడు కోర్టుకు వెళ్లినా ఉప‌యోగం ఉండ‌ద‌ని ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏతావాతా తేలిందేమిటంటే.. వీరంతా కేవ‌లం తెర‌పైన మాత్ర‌మే న‌టించ‌డంలేదు.. నిజ జీవితంలో అంత‌క‌న్నా అద్భుతంగా న‌టిస్తున్నారు అనే అభిప్రాయాన్ని ప్ర‌జ‌లు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇన్నిరోజుల్లో ఒక్క స‌భ్యుడు కూడా క‌ళాకారుల‌కు ఇది చేస్తాం.. మా అభివృద్ధి ప‌నులు ఇలా ఉండ‌బోతున్నాయి.. భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక ఇదీ అని ఒక్కరు కూడా చెప్ప‌లేదు. ఎవ‌రికివారు పైచేయి సాధించుకోవ‌డానికి ఆరాట‌ప‌డ్డారేకానీ అంద‌రూ క‌లిసి ఒక చేయి వేసి మాను పైకి లేపాల‌ని మాత్రం ఎవ‌రూ అనుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa