ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం మ‌ల్లికార్జున బ్ర‌మ‌రాంభ స్వామివారి దేవాల‌యానికి భ‌క్తులు నిత్యం వ‌స్తుంటారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీ‌శైలం వ‌చ్చి స్వామివారిని  దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఇది ఇలా ఉంటే.. శ్రీ‌శైలం ప్ర‌ధాన ఆల‌యానికి స‌మీపంలో ఓ యువ‌తి పురుగుల మందు తీసుకొని వ‌చ్చి ఆత్మ‌హత్య‌య‌త్నం చేసిన‌ది.

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన మౌనికారెడ్డి(25) ప్ర‌ధాన ఆల‌యం వ‌ద్ద‌కు పాయిజ‌న్ తీసుకుని చేరుకుంది. ఇది గ‌మ‌నించిన అక్క‌డ ఉన్న భ‌క్తులు  పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆత్మ‌హ‌త్య చేసుకుని అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన యువ‌తిని వెంట‌నే అంబులెన్స్‌లో సున్నిపెంట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. మౌనిక‌రెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేద‌ని.. కానీ మౌనికారెడ్డి వద్ద పోలీస్ ఫిర్యాదు కాపీ ల‌భించిన‌ది. దాని ఆధారంగా విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: