విశాఖ పట్నంలో రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించబోతున్నారు. విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్న సీఎం వైఎస్‌ జగన్‌.. రేపు ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.


రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ లో జరిగే  విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. ఆ తర్వాత  పీఎంపాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకోనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం అవుతారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ అనేక కార్యక్రమాలకు సీఎం జగన్ ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో ఈ పర్యటన కూడా భాగమే.

మరింత సమాచారం తెలుసుకోండి: