ఇటీవల దేశంలో బ్యాంకు స్కాం లు ఎక్కువ చూస్తున్నాం. ఆయా వ్యాపారాలు దొంగ పత్రాలు చూపించి బ్యాంకుల వద్ద నుండి వేలకోట్ల అప్పు తీసుకోని అనంతరం తీర్చకుండా విదేశాలు పారిపోతున్నారు. నిరవ్ మోడీ, చౌకి లాంటి వారు ఆ కోవకు చెందిన వారే. వాళ్ళు వ్యాపారం అని చెప్పి ఇష్టానుసారం గా తలకు మించిన భారం నెత్తిన వేసుకొని తరువాత చేతులు ఎత్తేస్తున్నారు. దీనితో ఆయా బ్యాంకులు దాదాపు దివాళా స్థితికి వస్తున్నాయి. ఇలా పారిపోయిన వారి నుండి కేంద్రం సహా ఏ ప్రభుత్వాలు పైసా కూడా వసూలు చేయలేకపోయారు. వీళ్లపై ఎన్నో కేసులు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. తప్పు బ్యాంకుల వద్ద ఉంచుకొని వీరిని శిక్షించడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళను, వాళ్ళ ఆస్తులను కూడా ఏమి చేయలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే బ్యాంకులకు కొత్త పాలసీలు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ఇక మీదట డిఫాల్టర్ లను ఎప్పటికప్పుడు  కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయినా దేశంలో ఇంకా ఈ తరహా స్కాం లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఎస్ బ్యాంకు లో 4వేల కోట్లకు పైగా అప్పు తీసుకోని బ్యాంకుకు టోపీ పెట్టబోయారు. దానిని కనిపెట్టిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లు ఇప్పుడు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికీ బెయిల్ ఇస్తూపోతే పారిపోతారనే కనీస జ్ఞానం లేకుండా ఉంది. ఆ కోర్ట్ కాకపోతే ఇంకో కోర్టు అని వీళ్లు ధీమాగా బెయిల్ కోసం తిరుగుతున్నారు.

ఇన్ని కోర్టులు ఉందట ఏదో ఒక కోర్టులో వక్తులను మేనేజ్ చేసి బెయిల్ పొందవచ్చు అనేది వాళ్ళ ఆలోచన కావచ్చు. ఆ మాత్రం ముందస్తుగా వారి ఆలోచన కనిపెట్టకుండా కోర్టులు కూడా ఇలాంటివారికి బెయిల్ ఇస్తూపోతే  పారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో ఆలోచించుకోవాలి. తప్పు జరిగిన తరువాత కోర్టులో శిక్షించడం కంటే ముందుగానే ఆయా వ్యవస్థలపై కోర్టులు లేదా న్యాయవ్యవస్థ
 ఒక కన్నేసి ఉంచితే వీళ్లు తప్పు చేయకుండానే పరిస్థితులను చక్కదిద్దుకోవచ్చు అనే ఆలోచన ఎవరికీ రాదా అని సామాన్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: