మనిషి ఆలోచనలు సక్రమంగా ఉంటే మనుషులు కూడా సక్రమంగానే జీవిస్తారు.. కానీ నేటికాలంలో మంచి చెడులను ఆలోచించే వివేకాన్ని కోల్పోతున్న మనుషులు తప్పుచేయడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు.. అదీగాకుండా నేరస్దులను శిక్షించడానికి ఎన్ని చట్టాలు అమలవుతున్నా, ఎంతటి దారుణ శిక్షలు వేసిన నేరస్వభావాన్ని మాత్రం విడిచి పెట్టడం లేదు.. ముఖ్యంగా ఆడవారిని చూస్తే చాలు తోడేళ్లలా ఎగబడుతున్న కామాంధుల విషయంలో చట్టాలు ఎన్ని ఉన్నా వారి ఒంటిలో నామ మాత్రమైన భయాన్ని కలిగించలేక పోతున్నాయి..

 

 

ఇకపోతే తొమ్మిదేండ్ల క్రితం ఢిల్లీలో నిర్భయపై కదులుతున్న బస్సులో సామూహిక లైంగిక దాడి జరిగిన విషయం ఇంకా మరవక ముందే ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకున్నది. కదులుతున్న బస్సులోనే అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు‌ ఆమెను బలవంతంగా లొంగదీసుకొని లైంగిక దాడికి ఒడిగట్టారు.. సమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ సంఘటన గురించి తెలుసుకుంటే ప్రతాప్‌గఢ్‌ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్‌ బస్సులో 25 ఏళ్ల మహిళ ఎక్కింది. ముందు వరుసలో సిట్లు ఖాళీ లేకపోవడంతో వెనక సీట్లో ఒంటరిగా కూర్చున్న ఆ మహిళపై బస్సు డ్రైవర్లు ఇద్దరు కన్నేశారు.

 

 

ఈ క్రమంలో బస్సులో మిగితా ఫ్యాసింజర్లు గాఢ నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున లక్నో, మధుర జాతీయ రహదారి పై బస్సు కదులుతుండగానే, కత్తితో ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారానికి ఒడికట్టారట.. బాధితురాలి ఫిర్యాదుతో ఒకరిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇకపోతే ఘటన జరిగిన సమయంలో బస్సులో పన్నెండు మంది వరకు ఫ్యాసింజర్లు ఉన్నారని తెలుస్తుంది.. అయినా ఏ ఒక్కరి కంట్లో కూడా ఈ దారుణం పడకపోవడం దురదృష్టకరం..  

మరింత సమాచారం తెలుసుకోండి: