సంక్షోభ సమయంలోనే మన లోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మన సామర్థ్యాలపై  పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఓ నమ్మకం ఏర్పడుతుంది.  కష్ట కాలంలో పార్టీని ఎలా నడిపించాలో చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనో స్థైర్యాన్ని కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై, పార్టీ నేతలపై ఉంది.


చంద్రబాబు ఖాళీ గా ఉంటారు అని ఎవరూ అనుకోరు.  ఏడు పదుల వయసులోను ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వం పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరో పక్క పార్టీ జిల్లాల వారీగా బలోపేతంపై దృష్టి సారిస్తూ నియోజకవర్గ నేతలతో మాట్లాడుతూనే ఉంటారు. తనకు ఏం ప్రయోజనం పార్టీకి ఏం లాభం.. ప్రత్యర్థి పార్టీ నాయకులని ఎలా దెబ్బ కొట్టాలి..  ఈ క్రమంలో తమ పార్టీని ఎలా ముందకు తీసుకువెళ్లాలి అనే విషయాలపై నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంటారు.


ఇలా ఎప్పుడూ తీరిక లేని సమయాన్ని గడిపిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నారు. వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్ ద్వారా అది కూడా 40 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం. ఆ తర్వాత అంతా ఖాళీనే. ఇది ఆయన్ను ఇబ్బంది కలిగించే అంశం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మానసిక ధైర్యం కోల్పోకుండా ఉంటే ఆయనకు తిరుగు ఉండదు.


అధికారాన్ని అనుభవించిన వారు అది లేకపోతే ఉండలేరు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన హవా కొనసాగించిన ఆయన ఇప్పుడు ఎవరికీ పట్టనట్లు.. ఒంటరిగా ఉండటం కొంత ఇబ్బందిని కలిగిస్తోంది అనడంలో సందేహం లేదు. వయసు రీత్యా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ సందర్భంలో ఆయన శారీరక ధృడత్వంతో పాటు  మానసికంగా కూడా ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కితే పార్టీని మరో 20 ఏళ్లు నడపగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: