ఇటీవల కాలంలో చాలా తక్కువ కాలంలోనే తెలివి తేటలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ఎలన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ తో నడిచే వాహనాలు, సోలార్‌ టెక్నాలజీ, స్పేస్‌ టూరిజం, డ్రైవర్‌ లేని ఆటోమేటిక్ కారు అంటూ ఎన్నో ప్రయోగాలతో కూడిన వ్యాపారాలు చేస్తూనే ఎలన్‌ మస్క్‌ తొలిసారిగా అకడమిక్‌ అంశాలపై స్పందించారు. అతిత్వరలో యూనివర్సిటీ మొదలుపెట్టాలని అనుకుంటున్నట్టు ఎలన్‌ మస్క్‌ సామజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. దీనిని టెక్సాస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ పేరుతో కొత్తగా స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు. తాను విద్యారంగంలో అడుగు పెట్టాలన్న ఎలన్‌ మస్క్‌ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఎలన్‌ మస్క్‌ కు సాధారణంగా కాకుండా కాస్త భిన్నంగా అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచనలు చేయడం అలవాటు. అదే అతనిని విజయ వైపు నడిపించింది. గతంలోనే ఎవరూ నమ్మని సమయంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలదే భవిష్యత్తు అని అతడు అంచనా వేశాడు. అలాగే అసలు ఊహించడానికే సాధ్యంకాని స్పేస్‌ టూరిజంకి ఫ్యూచర్‌ ఉందని భారీ పెట్టుబడులు పెట్టింది కూడా అతడే. అలాగే మరో ప్రయోగం డ్రైవర్‌ లేని కారు, దీనికి సంబంధించి ఎలన్‌ మస్క్‌ తీవ్రంగా ప్రయత్నించినా పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదు. ఒక అడుగు ముందుకి పడితే రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనితో తన ఆలోచనలకు తగ్గట్టుగా రేపటి పౌరులను కాలేజీ డేస్‌ నుంచే తీర్చిదిద్దడం ద్వారా తన లక్ష్యాలను సాధించాలని ఈ వర్సిటీని స్థాపించి ఉండవచ్చు.

తాను చేస్తున్న ప్రయోగాల నేపథ్యంలో ఫలితాలు వస్తున్నందున స్వల్ప కాలంలో ఎలన్‌మస్క్‌కి చెందిన టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్‌ కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. టెస్లా కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లను చేరింది. దీనితో అతని సంపద ఏకంగా 300 బిలియన్లకు చేరుకుంది. ఈ దెబ్బతో ఎన్నో ఏళ్లుగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా సంపద విషయంలో అతని దరిదాపుల్లో లేకుండాపోయారు. విద్య వ్యాపారం అయిన విషయం ఆయనకు కూడా తెలిసిందేమో, దానిపై మనసు పెట్టాడు ఎలన్‌ మస్క్‌. ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయం వెంక కూడా అదే కారణం అయిఉంటుందా అనే వేచిచూడాల్సిందే. విద్యా పరంగా అతడికి ఎంతో ఇష్టమైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలే ప్రధానంగా యూనివర్సిటీ స్థాపించాలని అనుకుంటున్నాడు. చూడాలి ఏమి జరుగుతుందో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: