ఏపీ రాజ‌కీయాల‌పై ఎప్పుడూ ఆస‌క్తే! చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా.. ఇప్పుడు జ‌గ‌న్ పాలిస్తున్నా.. ఏపీ విష‌యంలో రాష్ట్రంలోను, దేశంలోను, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలోనూ ఎప్పుడూ ఆస‌క్తిక‌ర జ రుగుతూనే ఉంటుంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో.. ఆయ‌న‌తో పోలిస్తే.. అత్యంత పి న్న వ‌య‌సులో ప్ర‌తిప‌క్షంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ఏం చేస్తారు? చ‌ంద్ర‌బాబుతో ఎలా ఢీ కొంటారు? అనే చ‌ర్చ న‌డిచింది. ఇక‌, జ‌గ‌నే ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన త ర్వాత‌.. ఆయ‌న పాల‌న ఏవిధంగా ఉంటుంది? ఆయ‌న విధంగా ముందుకు సాగుతారు?  రాష్ట్రంలో ఎలాం టి పాల‌న అందిస్తారు?  


ఆయ‌న చెప్పిన‌ట్టు 30 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకునేలా ఆయ‌న దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటా రా? అనే చర్చ సాగుతోంది.  నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ పాలిటిక్స్‌పై ఉన్న ఆస‌క్తి.. చాలా డిఫ‌రెంట్‌.. ఇక‌, తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. అయితే, ఈ ఏడాది కాలంలో ఆయ‌న చేసిన సంక్షేమంపై ఎవ‌రికీ ఎలాంటి విమ‌ర్శ‌లూ లేవు. జ‌గ‌న్ పాల‌న‌ను.. ఆయ‌న వ్యూహాల‌ను.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌ను కూడా అంద‌రూ మెచ్చుకున్నారు. ఇదే విష‌యం చ‌ర్చ‌ల్లోనూ ప్ర‌తిబింబించింది. టీడీపీ ఆరోప‌ణ‌ల వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెడితే.. మిగిలిన నేత‌ల నుంచి కానీ, మిగిలిన పార్టీల నుంచి కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద ఇబ్బంది క‌ర ప‌రిణామం ఎక్క‌డా క‌నిపించ‌లేద‌నే అంటున్నారు. 


అయితే, తాజాగా జ‌గ‌న్ విష‌యంలో ఇసుక స‌హా.. రాజ‌ధానులు.. ప్రాజెక్టుల అంశాల‌పై ఒకింత వ్య‌తిరేక ప్ర‌చారం సాగుతోంది. స‌రే.. ప్ర‌తిప‌క్షాలు కాబ‌ట్టి.. ఎలాగూ జ‌గ‌న్‌పై ఏదో ఒక‌టి ఆదిపోసుకోవాలి.. కాబ‌ట్టి.. ఇ లా చేస్తున్నార‌ని స‌రిపెట్టుకున్నా.. తాజాగా జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో తెలుగు వారు.. మ‌రీ ము ఖ్యంగా వైసీపీ అభిమానులు, సానుభూతిప‌రులు కూడా ఈ మూడు విష‌యాల‌పై ఒకింత పెద‌వి విరుస్తు న్నారు. సంక్షేమం బాగానే ఉంది.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందాల్సిందే.. అయితే, అదేస‌మ‌యం లో.. రాష్ట్ర అభివృద్ది కూడా ముఖ్య‌మే క‌దా? అనేది వారి ఆలోచ‌న‌. ఇది అంద‌రూ అంగీక‌రిస్తున్న వాస్త‌వం. ఎందుకంటే.. చంద్ర‌బాబుపై ప‌నిమంతుడు.. ఆయ‌న నిద్ర‌పోడు.. ఎవ‌రినీ నిద్ర‌పోనివ్వ‌డు.. అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తారు.. అనే పేరుంది. మంచికైనా చెడుకైనా ఈ పేరు ఆయ‌న‌కు శాశ్వ‌తంగా ఉండిపోయింది. 


ఇలాంటి ప‌రిస్థితి జ‌గ‌న్‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఆయ‌న వ్యూహం ఆయ‌న‌కు ఉంది. ఆయ‌న అధికారంలోకి రాగానే పోలీసుల‌కు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చేశారు. అధికారుల‌కు సాయంత్రం ఆరు త‌ర్వాత ఆఫీసుల్లో ఉండొద్ద‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న సంక్షేమ ప‌థ‌కాలు, మేనిఫెస్టోలో చెప్పిన విష‌యాల‌కు కూడా ఓ టైంబేస్డ్ పెట్టుకుని, దాని ప్ర‌కారం ముందుకు సాగుతున్నారు. అంటే.. మొత్తంగా ఓ టైమ్ టేబుల్ గ‌వ‌ర్న‌మెంట్‌.. ఏపీలో న‌డుస్తోంది. ఇదే విష‌యాన్ని మ‌రికొంద‌రు ప్ర‌స్తావిస్తు న్నారు. సో.. జ‌గ‌న్ తొలి ఏడాది సంక్షేమ సంవ‌త్స‌రం అని చెప్పుకుందామ‌ని, రెండో ఏడాది అభివృద్దితో కూడిన సంక్షేమంగా ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయ‌మ‌ని వారు అంటున్నారు. 


ఈ క్ర‌మంలోనే యువ‌నాయ‌కుడు, మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి, ఎంపీలు.. బాల‌సౌరి, కోట‌గిరి శ్రీధ‌ర్ ల‌కు అప్ప‌గించార‌ని, వారు ఇప్ప‌టికే విదేశీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏపీకి తెచ్చేందుకు కృషి చేస్తున్నార‌ని ఓ వ‌ర్గం వైసీపీ సానుభూతి ప‌రులు చెబుతున్నారు. అంటే.. మొత్తంగా జ‌గ‌న్‌కు విజ‌న్ ఉంద‌ని, ఆయ‌న ప్ర‌భుత్వానికి ఓ టైమ్ టేబుల్ ఉంద‌ని.. ఈ విష‌యంలో ఇప్ప‌టికిప్పుడు మ‌నం ఓ అంచ‌నాకు వ‌చ్చి.. టీడీపీ మాదిరిగా ముద్ర వేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా తొలి ఏడాది.. ఇలానే సంక్షేమ ప‌థ‌కాల‌నే అమ‌లు చేసింద‌ని.. 2015 మ‌ధ్య నుంచి మాత్ర‌మే రాజ‌ధాని స‌హా .. ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టింద‌ని, ఈ విష‌యాన్ని కూడా గ‌మ‌నించాల‌ని అంటున్నారు. సో.. మొత్తంగా
వైసీపీలో రెండు గ్రూపులు..ఇలా ఆస‌క్తిక‌ర చ‌ర్చ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: