గత నలభై ఒక్క రోజుల నుంచి బంగారానికి రెక్కలు వస్తున్నాయి. ఈ లాక్డౌన్ సమయంలో బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే  ఈ లాక్ డౌన్ లోచాలా వరకు పెళ్లిళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆడ పెళ్ళి వారు తమ బిడ్డలకు బంగారు కాసులు చేయించడం కోసం ఎంతో సతమతమవుతున్నారు. బంగారం పెరిగిపోవడంతో  ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు.


ప్రతి ఒక్కరికి బంగారం చాలా అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బంగారం ధరలు పెరుగుతూ ఉంటే, నగలు కొనుక్కోవాలి అనుకునే వారికి సమస్యలు, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సంతోషాలు ఉండడం సహజం. నిజానికి ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం రాగానే బంగారం ధరల్లో పెరుగుదల మొదలైంది. ఇక అంతవరకు మధ్యమధ్యలో తగ్గుతున్నప్పటికీ, ఇక మొత్తంగా ఈ 41 రోజులకు చూసుకుంటే బంగారం , వెండి ధరలు భారీగానే పెరిగాయి.

అంటే ఈ 41 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం , 10 గ్రాములు 3,600 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ. 3,930 పెరిగింది. అంటే ఎవరైతే నగలు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది ఇబ్బందికరమైన అంశమే అని చెప్పుకోవచ్చు.

ఇక ఈ రోజు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే, నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కు రూ.44,700 ఉండగా, ఇక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు రూ.48,770 గా నమోదయింది. అంటే నగల తయారీకి ఉపయోగించే బంగారం ఒక గ్రాము కు రూ.4,470 ఉండగా, పెట్టుబడికి  ఉపయోగించే 24 క్యారెట్  గోల్డ్ ఒక గ్రాము ధర 4,877  రూపాయలుగా నమోదయింది. అంటే ఈ ధరలు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, సికింద్రాబాద్, వరంగల్ జిల్లాలలో ఒకేలా ఉండడం విశేషం..


ఇక వెండి విషయానికి వస్తే, కేజీ వెండి ధర 76 వేల రూపాయలు ఉంది. అంటే కేవలం ఆరు నెలల్లోనే రూ.12,600 కు  పెరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: