

ఈ ఆటిజం థెరపీ సెంటర్ లో న్యూరోడైవర్సిటీని ప్రోత్సాహించడానికి అత్యాధునిక సేవలు, ఇన్ క్లాస్ క్లినికల్ కేర్ అందిస్తోంది. స్పెషలిస్టుల ఆధ్వర్యం లో పిల్లల మానసిక వికాసాన్ని పెంచేవిధంగా శిక్షణ కల్పిస్తోంది. ఇందులో ఆటిజం థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్‌తో బాధ పడుతున్న పిల్లలకు ప్రత్యేక చికిత్స చేస్తారు. అలాగే విద్య, డ్యాన్స్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ, హైడ్రో థెరపీ, ఫిజియో థెరపీ, అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కర్షన్స్ వంటి సేవలు కూడా కల్పిస్తారు. పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ సేవలు పొందేందుకు ఉచిత జాతీయ హెల్ప్ లైన్ నంబర్: 9100 181181 కూడా అందుబాటులో ఉంది.
పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీజా రెడ్డి సరిపల్లి మాట్లాడుతూ.. ‘‘ఆటిస్టిక్ వ్యక్తుల జీవితాల్లో ఆనందం నింపే దిశగా ఈ ఆటిజం థెరిపీ కేంద్రాలు ప్రారంభించాము. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వైజాగ్‌లో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశాము. న్యూరోడైవర్సిటీని ప్రోత్సహించడాని కి స్పెషలిస్టుల ఆధ్వర్యంలో పిల్లల కు చికిత్స అందిచడం జరుగుతుంది. ఆటిస్టిక్ వ్యక్తుల కు సాధ్యమైనంత వరకు ఉత్తమమైన చికిత్స అందించడానికి పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ ఎంతో కృషి చేస్తోంది.’’ అని ఆమె పేర్కొన్నారు.