ప్రపంచానికి అతిపెద్ద సంక్షోభం తెచ్చిపెట్టిన కరోనా దరిచేరని ప్రదేశం లేదు. పలానా చోట లేదు అనుకోకుండా ప్రతి ప్రాంతాన్ని ఆవహించింది. అందుకే ఇప్పుడు వాక్సిన్ కూడా ఏకంగా ఖండాలు కూడా దాటి వెళ్తుంది. అక్కడి వారికి కూడా ఆయా ప్రభుత్వాలు సరఫరా చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇదే అతిపెద్ద మార్కెట్, వాక్సిన్ మార్కెట్. అదేదో వాక్సిన్ అమ్ముకోవడానికి ప్రపంచానికి కొందరు ఈ వైరస్ ను పరిచయం చేసినట్టుగా ఉంది. ఇలాంటివి సినిమాలలోనే చూస్తాం, దీనిని సృష్టించిన వాళ్ళు కూడా అవి చూసే స్ఫూర్తిని పొంది ఉండొచ్చు మరి. ఏది ఏమైనా నేడు ప్రపంచానికి ఆరోగ్య సంక్షోభం సహా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొంటూనే బ్రతికి తీరాలి అనే ఆశతో మనిషి వాక్సిన్ కనుగొన్నాడు. అదే అందరికి కాస్త ధైర్యాన్ని ఇస్తుంది.

అది కూడా కాపాడకపోవచ్చు, కేవలం ఉపశమనం కావచ్చు కానీ, అదంటూ ఒకటి ఉండనే ధైర్యం మాత్రం మనిషికి వచ్చేసింది. అందుకే అది రాగానే దానిని వేసుకొని తన జీవిత  పోరాటాన్ని మొదలు పెట్టేశాడు మనిషి. వాక్సిన్ మానుషాలకే ఇస్తున్నారా, కరోనా జంతువులకు కూడా వచ్చింది, మరి వాటికీ కూడా ఇస్తున్నారా అనేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ముందు ప్రయోగం చేసింది జంతువుల మీదనే కాబట్టి వాటికీ ఇదే పని చేస్తుండవచ్చు. అయినా మనిషికే సరైన మోతాదులో దొరక్క అల్లాడిపోతుంటే, జంతువులకు దొరికేనంటారా.. చూద్దాం కొందరు జంతు ప్రేమికులు తమ వాక్సిన్ డోసులను తమ పెంపుడు జీవాలకు ఇచ్చారేమో ఎవరికి తెలుసు.

అయితే తాజాగా ఈ వాక్సిన్ ఖండాంతరాలకు చేరుకుంది. బ్రిటన్ కు చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందిన ఆస్ట్రా జెనికా వాక్సిన్ గత 9 నెలలుగా అనేక మందికి వేశారు. ఇప్పుడు ఇది అంటార్కిటికా మంచు ఖండానికి చేరింది. అక్కడ ఉన్న ఒక పరిశోధనా కేంద్రంలో పని చేసే 23 మంది సిబ్బందికి ఇచ్చేందుకు అక్కడకు ఈ వాక్సిన్ ను చేర్చారు. అంటార్కిటికా లో అనేక దేశాలు తమతమ ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే కేవలం చీలి కి చెందిన వారిలో మాత్రమే కరోనా  లక్షణాలు కనుగొన్నారు. దీనితో అక్కడకు వాక్సిన్ తరలించారు. ప్రస్తుతం వాళ్లకు ఇస్తుంది తొలి డోస్, మరో నాలుగు వారాలలో రెండో డోస్ కూడా ఇవ్వనున్నారు. దీనికోసం ఒక విమానం 10వేల మైళ్ళు ప్రయాణించాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: