ఈ మ‌ధ్య కాలంలో పిల్ల‌ల‌కు చిన్న చిన్న విష‌యాల‌కే డిప్ర‌ష‌న్‌కి గుర‌వుతున్నారు. చిన్న విష‌యాల‌కి కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. దానికి ప్ర‌ధాన కార‌ణం పిల్ల‌లను త‌ల్లిదండ్రులు మంచి చెడులు చెప్ప‌క‌పోవ‌డ‌మే. ఇప్పుడు ఉన్న యాంత్రిక జీవితంలో తెల్లారి లేచిన ద‌గ్గ‌ర నుంచి ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉండ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా ఫోన్ లేదా ట్యాబ్‌, టీవీ లాంటివి అల‌వాటు చేయ‌డం వ‌ల్ల వాళ్ళు ఎక్కువ‌గా వాటికి అడిక్ట్ అయి వాటి కోసం ఏమి చెయ్య‌డానికైనా సిద్ధ‌ప‌డుతున్నారు. ఇక వాళ్ళ‌తో ఆడుకోవ‌డానికి వాళ్ళ స్ట్రెస్‌ని పంచుకోవ‌డానికి ఎవ్వ‌రూ లేక ఎక్కువ‌గా వాటికి అవాటు ప‌డుతున్నారు. త‌ల్లిదండ్రులిద్ద‌రూ ఉద్యోగ‌స్తులు అవ్వ‌డంతో వాళ్ళు చివ‌రికి వీటికి అల‌వాటు ప‌డి ఒక్కోసారి ఏం చేస్తున్నారో ఏంటో కూడా తెలియ‌డంలేదు.

 

త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ కూడా ఉద్యోగ‌స్తులైతే పిల్ల‌ల‌ను ప‌ట్టించుకునేవారు క‌రువ‌రుతారు. దాంతో వారికి మంచి చెడు తెలియ‌డం లేదు. దాంతో వారు ఏ ఒక్క చిన్న విష‌యానికి అస‌హ‌నానికి గుర‌యినా స‌రే ఏకంగా వారి జీవితాన్నే అంతం చేసుకుంటున్నారు. ఇటీవ‌లె అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి హైద‌రాబాద్ మియాపూర్‌లో ఒక‌టి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... త‌ల్లిదండ్రులిద్ద‌రూ కూడా ఉద్యోగ‌స్తులు దాంతో ఇంట్లో ఒక ట్యాబ్ కొని పిల్ల‌లు ఆడుకోవ‌డానికి ఇచ్చారు. వారికి ఇద్ద‌రు మ‌గ‌పిల్లలు ఒక‌రు తొమ్మిదేళ్ళు, మ‌రొకిరికి 10 ఏళ్ళు ఉంటాయి. ఇద్ద‌రూ ఆ ట్యాబ్ కోసం కొట్టుకుంటూ ఓ సారి వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళే స‌మ‌యంలో నాన్న త‌మ్ముడు చూడు నాకు టాబ్ ఇవ్వ‌డం లేదు అన్నాడు. 

 

దానికి త‌న తండ్రి త‌ప్పు నాన్న ఇద్ద‌రు ఆడుకోండి. ఒక‌సారి అన్న‌కి కూడా ఇవ్వు అని చెప్పి వెళుతున్నాడు.  వాళ్ళు ఉండేది మూడ‌వ ఫ్లోర్ కావ‌డంతో స‌రే అన్నాడు. ఇక అయినా కూడా త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ బాలుడు తండ్రి కింద‌కు దిగే లోపు పై ఫ్లోర్ నుంచి కింద‌కి దూకేశాడు. అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. దీంతో త‌ల్లిదండ్రులిద్ద‌రూ క‌న్నీరు మున్నీర‌య్యారు మ‌రి ఇలాంటి సంఘ‌ట‌న‌లు రోజూ ఎన్నో జ‌రుగుతూ ఉన్నాయి. దీనికి పిల్ల‌ల‌ను స‌మైన దారిలో పెంచ‌డం త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: