ఇందుకోసం మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టుకుంటే ఫ్రాంచైజీని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.. ముఖ్యంగా ఈ కంపెనీ తమ భాగస్వాములకు ఏకంగా 40 శాతం మార్జిన్ కూడా అందిస్తోంది. ఇక ఇతర పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కూడా 15 నుంచి 20 శాతం వరకు మార్జిన్ అందిస్తూ ఉండడం గమనార్హం.. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీలు 1000 రకాల జెనరిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఇప్పటికే ఎంతోమంది ఈ ఫ్రాంచైజీని కూడా తీసుకున్నారు..
ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్, ముంబై వంటి ప్రాంతాలలో చాలా మంది నెలకు 8 నుంచి 10 లక్షల వరకు కేవలం ఈ ఫ్రాంఛైజీల ద్వారానే సంపాదిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.. అయితే మీరు కూడా నెలకు ఎంత సంపాదించవచ్చు అనే విషయం మీ రిటైల్ షాప్ పరిమాణం బట్టి , ఉండే ప్రాంతం యొక్క ప్రాతిపదికన బట్టి మారుతూ ఉంటుంది.. పట్టణ ప్రాంతాలు నగరాలలో అయితే లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు.. అదే గనుక గ్రామీణ ప్రాంతాలు, మండల ప్రాంతాలలో అయితే కొంత వరకు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా లక్షల్లో డబ్బు సంపాదించాలని ఆశిస్తే, మహానగరాలలో బ్రాంచీలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.