ఆర్ ఆర్ ఆర్ సినిమా గ్రాండ్ సక్సెస్ ను ntr 30 తో కంటిన్యూ చెయ్యాలని ఇటు తారక్ ఇంకా అటు అభిమానులు ఇద్దరూ కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. వీరిద్దరి కన్నా డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ మరకను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఎలాగైనా సరే పోగొట్టుకోవాలని ఇంకా చిత్తశుద్ధితో సినిమా కోసం పని చేస్తున్నాడు.కానీ, ఆచార్య సినిమా ఫైనాన్సియల్ సెటిల్మెంట్స్ ఇంకా క్లియర్ అవ్వకపోవడంతో కొరటాల వాటిని చక్కదిద్దే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేసుకుని తారక్ 30 వ సినిమాపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్సన్ట్రేట్ చెయ్యాలని చూస్తుంటే, అంతకంతకు ఆచార్య సినిమా వివాదాలు ఎక్కువవుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. దీంతో కొరటాల శివ తారక్ సినిమాపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు.ఇది గమనించిన తారక్ తన 30వ సినిమా స్క్రిప్ట్ పనులు శ్రీఘ్రంగా ఇంకా అలాగే మంచి కంటెంట్ తో రచింపబడేటట్టు ఒక స్టార్ రైటర్ ను కూడా కొరటాలాకు రికమెండ్ చేసాడంట.


ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ తో పాటు ఈ సినిమాకు కూడా త్వరలోనే పని చేయబోతున్న ఆ రైటర్ ఇంకొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ 30 వ సినిమా రైటర్స్ టీం తో జాయిన్ అవ్వబోతున్నాడట. అంతవరకు కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఆపేయమని తారక్ చిత్రబృందానికి ఆర్డర్ వేయడం జరిగిందట. ఇక ఈ మేరకు ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం అనేది జరుగుతుంది.నిజానికి ఆర్ ఆర్ ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్ కి ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చిన వచ్చిన తారక్ ఇమేజ్ డామేజ్ అవ్వడం ఖాయం. ఒక పాన్ ఇండియా హీరో ఇమేజ్ వచ్చాకా దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకే తారక్సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వుంటున్నాడు.లేదంటే అటు అభిమానులు కూడా చాలా సఫర్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: