బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన అనసూయ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒకప్పుడు వరుస టీవీ షోలో చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్ముడు ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితమైంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా మిగిలాయి.దీంతో అనసూయ క్రేజ్ మరింత పెరిగిపోవడంతో తన డిమాండ్ ను కూడా పెంచేస్తుంది అనసూయ .భారీ  రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలా సందర్భాల్లో అనసూయ తను చేసే ప్రతి పనికి తన భర్త చాలా సపోర్ట్ చేస్తాడని వెల్లడించింది. 

అయితే దానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అనసూయ  భర్తకి అనసూయ అంటే చాలా ఇష్టం. ఏది కావాలనుకున్న అడగకముందే ఇస్తాడట ఇక అంతలా తనని ప్రేమించే భర్త అనసూయ వద్దన్నా కూడా ఒక పని చేస్తాడట. ఆ పని చేయొద్దని ఎన్నిసార్లు తన భర్తకి చెప్పిన కూడా తన భర్త మాట వినడట. అయితే తాజాగా ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ అనసూయ ఎంత చెప్పినా వినకుండా తనకి ఇష్టమైన ఫుడ్నివ్వండి ఆమెకి చాలా ప్రేమగా తినిపిస్తారట.

ఇక ఆ ఫుడ్డు తింటే నేను లావు ఎక్కుతాను అని చెప్పిన కూడా ఏం కాదు నువ్వు బొద్దుగా ఉన్నా బానే ఉంటావు అని బలవంతంగా అనసూయ కి తినిపిస్తాడట శశాంక్ భరద్వాజ్.అంతే కాదు ఈ విషయంలో ఎన్ని సార్లు కోపడ్డా కూడా ఆ పని చేయకుండా శశాంక్ ఉండలేడు అని చెప్తోంది అనసూయ. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే ఇటీవల తెలుగులో రంగమార్తాండ సినిమాలో నటించిన అనసూయ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగుతోపాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: