తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను సొంతం చేసుకున్నారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించి సత్తా చాటారు. అలాంటి వారిలో కన్నడ పిల్ల ప్రణిత సుభాష్ ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్‌గా మారింది. అయితే, ఈ మధ్య తల్లవడంతో గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రణిత కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

టీనేజ్‌లోనే మోడల్‌గా పాపులర్ అయిన కన్నడ పిల్ల ప్రణిత సుభాష్.. మాతృభాషలో 'పోర్కి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అదిరిపోయే యాక్టింగ్‌తో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని ఇండస్ట్రీల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది.
టాలీవుడ్‌లో భారీ చిత్రాల్లో:అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న ప్రణిత సుభాష్‌కు తెలుగులో చాలా మంది చిన్న, పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా ఆమె 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లోనూ నటించింది. అలాగే, కుర్ర హీరోలతోనూ కొన్ని విజయాలను సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగి సత్తా చాటుకుంది.బాలీవుడ్ ఎంట్రీతో ఫుల్‌గా:ప్రణిత సుభాష్ కన్నడంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ఎంటరైన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. తద్వారా తన క్రేజ్‌ను దేశ వ్యాప్తంగా పెంచుకుంది. ఫలితంగా ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేసింది.

చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది తల్లైంది. ఈ మధ్యే మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌ పరంగా రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ప్రణిత 'రమణ అవతార' అనే కన్నడ మూవీతో పాటు దిలీప్ మలయాళ చిత్రంలోనూ చేస్తోంది.హీరోయిన్‌గా ఇప్పటికీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ హైలైట్ అవుతోంది.హీరోయిన్ ప్రణిత సుభాష్ తల్లైన తర్వాత కూడా సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ గీత దాటేసి మరీ తీసుకున్న గ్లామరస్‌ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి ఉంటున్నాయి. దీంతో ప్రణిత సుభాష్ తరచూ వార్తల్లోనే భాగం అవడంతో పాటు ఆమె క్రేజ్ మరింతగా పెరుగుతోంది.

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో ప్రణిత సుభాష్ అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని, పైటను పక్కకు జరిపేసి మరీ క్లీవేజ్ షో చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా వీటిలో ప్రణిత అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: