రజనీకాంత్ పోలీస్ వేషం కట్టి చాలా రోజులైంది. ఇపుడు ఆయన పూర్తిగా కొత్త గెటప్ లో రంగంలోకి దిగిపోయారు. మురుగదాస్ డైరెక్షన్లో దర్బార్ మూవీలో ఖాకీ యూనిఫారంలో పవర్ ఫుల్ గా రజనీ కనిపిసున్నారు. లేటేస్ట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో  షేక్ చేస్తోంది. ఇలా రిలీజ్ కావడమేంటి అలా సరికొత్త  రికార్డ్ క్రియేట్ చేస్తోంది. 


దీన్ని బట్టి చూస్తూంటే రజనీ కాంత్ మూవీని ఆషామాషీగా తీసుకోవడానికి లేదని అంటున్నారు. గత ఏడాది సంక్రాంతికి  పేట సినిమాతో వచ్చిన రజనీ కలెక్షన్స్ కొల్లగొట్టుకుపోయాడు, ఈసారి భారీ అంచనాల మధ్య వస్తున్న దర్బార్ కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దీనికి సంబంధించి ధియేటరికల్  రైట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన హస్తవాసి తెలిసిన వారు చెబుతున్న దాన్ని బట్టి చూసినా కూడ దర్బార్ మోత మోగించడం తప్పదని  అంటున్నారు.


ఇక మోషన్ పోస్టర్ ని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేయడం విశేషం. దక్షిణాది భాషల్లో మిగిలిన టాప్ స్టార్స్ రిలీజ్ చేశారు. రజనీకాంత్ స్టైల్, దానికి తోడు పవర్ ఫుల్ స్టోరీ , మురుగదాస్ డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార కనిపిస్తోంది. రజనీకాంత్ నయన్  కాంబో కూడా సూపర్ హిట్టే. చంద్రముఖితో మొదలుపెట్టి శివాజీ తో కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసారు. ఇపుడు దర్బార్ వస్తోంది. మొత్తానికి రజనీ సంక్రాంతి హీరోలను అదరగొడుతున్నాడు. బరిలో మహేష్, బన్నీ ఉన్నారు. రజనీ మూవీ  అంటేనే స్ట్రైట్ మూవీస్ తో సరిసమానమనే చెపాలి. మొత్తం మీద చూసుకుంటే దర్బార్ దడ పుట్టించడం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: