విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ శృతి హాసన్.  తన నటనతో, డ్యాన్స్‌తో, పాటలతో  ప్రతిభను చూపుతూ తండ్రి చాటు కుమార్తె అన్న ట్యాగ్‌ను తొలగించుకొని తన నటనతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. కొంతకాలంగా ఎటువంటి హడావుడి చేయకుండా కామ్‌గా ఉంటుంది. అదే సమయంలో ఆమె ఓ విదేశీయుడి ప్రేమలో పడటం..తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఆ మద్య తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలిపింది.  ప్రస్తుతం  మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ‘క్రాక్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది.  గతంలో రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్ లో బలుపు సినిమా వచ్చింది.  

 

మూవీ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో సినిమా పై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా శృతిహాసన్ లండన్‌ వీధుల్లో ఉత్సాహంగా డ్యాన్స్ తెగ హల్ చల్ చేసింది. దుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం 34వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె... తన స్నేహితులతో కలిసి లండన్‌ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్‌ చేసింది.   తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం.. తనకు అందరి ప్రేమ, దీవెనలున్నాయని, తాను చాలా అదృష్టవంతురాలినని తెలిపింది. 

 

తన పుట్టినరోజును ఎప్పటికీ మరిచిపోలేని విధంగా తన లండన్‌ స్నేహితులు జరిపారని పేర్కొంది. తన పుట్టినరోజును మరిచిపోలేని విధంగా జరిపిన లండన్‌ స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే శృతిహాసన్ రీ ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే.. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరసు ఫ్లాపులు అందుకుంటున్న రవితేజ సైతం ఈ మూవీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  ఇటీవల రవితేజ నటించిన డిస్కోరాజా మూవీ ఫ్లాప్ టాక్ రావడం తెలిసిందే. మరి ఈ మూవీ ఇద్దరికీ ఎంతో ముఖ్యమని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: