సరిగ్గా నలభై ఏళ్ల క్రితం తెలుగు చిత్రపరిశ్రమలో ఓ గొప్ప సినిమా వచ్చింది.  కె విశ్వనాధ్ దర్శకత్వంలో సంగీత ప్రదాంశంతో ఓ సినిమా తెరకెక్కింది.  అదే శంకరాభరణం.  కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా, వేటూరి అందించిన సాహిత్యం అజరామరంగా నిలిచింది.  సంగీతం అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ప్రపంచాన్ని అలలారించింది.  అప్పుడప్పుడే ఇండియాలోకి పాశ్చాత్య సంగీత పోకడలు వస్తున్నాయి.

 
దీంతో శాస్త్రీయ సంగీతానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. సినిమాల్లోనూ అదే పోకడ కనిపించింది.  దీన్ని ఎలాగైనా మార్చాలని అనుకున్న దర్శకుడు కె విశ్వనాధ్ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నారు.  సంగీతమే ప్రాణంగా భావించే శంకరశాస్త్రికి అనుకోకుండా ఓ వేశ్యకు ఆశ్రయం ఇవ్వాల్సి వస్తుంది.  అలా ఆశ్రయం ఇచ్చిన తరువాత ఆమె ఓ బిడ్డను ప్రసవించి శంకరశాస్త్రికి అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.  


వేశ్యకు ... శంకరశాస్త్రికి మధ్య ఉన్న అనుబంధం గురించి సమాజం తప్పుగా అర్ధం చేసుకుంటుంది.  కానీ, అయన అవేమి పట్టించుకోడు.  తనకు అప్పగించిన బిడ్డను పెంచి పెద్దచేసి తన సంగీతానికి వారసురాలిని చేస్తారు.  శంకరశాస్త్రిగా జెవి సోమయాజులు నటన అమోఘం.  ఇలా తులసి సినిమాలో సహజసిద్ధంగా నటించింది.  జెవి సోమయాజులకు తులసికి మధ్య ఉన్న సంగీత అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు.  


ఇప్పటి ఈ సినిమా వచ్చి 40 ఏళ్ళు అవుతున్న అందులోని పాటలు ఇప్పటికి మనిషిని ఎక్కడో ఒక చోట తాకుతూనే ఉంటాయి.  ఆ సినిమాలోని పాట వినిపిస్తే చాలు తెలియకుండానే నిలబడిపోయి పాట పూర్తయ్యేవరకు వింటాం.  ఇటువంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి అలా వచ్చిన తక్కువ సినిమాల్లో ఈ శంకరాభరణం కూడా ఒకటి అని చెప్పుకోవాలి. ఈ సినిమా మరో వందేళ్లు అయినా సరే ఇలానే ఉంటుంది.  ఇంతే గొప్పగా అప్పుడుకూడా చెప్పుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: