తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ గా మారక ముందు ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంగా ఏలిన హీరో ఎన్టీఆర్. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఏలిన ఎన్టీఆర్ తన వారసత్వాన్ని బాలకృష్ణ రూపంలో ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. హరికృష్ణను పరిచయం చేసినా కొన్ని సినిమాల వరకే పరిమితం అయింది కానీ పూర్తిస్థాయి నటుడిగా రాణించలేకపోయాడు. బాలకృష్ణ టాప్ హీరోగా ఉన్నా కూడా తర్వాత తరంలో మరెవరూ వారసులుగా రాలేకపోయారు. బాలకృష్ణ తర్వాత నందమూరి తరం నుంచి ఎవరు అనే ప్రశ్నకు నేనున్నానంటూ త్వరగానే సమాధానం చెప్పిన నటుడు జూనియర్ ఎన్టీఆర్.

 

 

పూర్తిగా సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గా ప్రేక్షకుల్లో బలమైన పునాదినే వేశాడు. పోలికల్లో, నటనలో, హావభావాల్లో, వాచకంలో, వాగ్దాటిలో, డైలాగులు చెప్పడంలో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ నే మరిపించాడు. ఎంతగా అంటే.. ఎన్టీఆర్ మనవడి సినిమాకు ఓ టికెట్ ఇవ్వండి అని ధియేటర్లలో టికెట్ కౌంటర్ల వద్ద అడిగేంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. డ్యాన్సుల్లో కూడా అద్భుత ప్రతిభ చూపిన ఎన్టీఆర్ పెద్ద పెద్ద డైలాగులతో ధియేటర్లను హోరెత్తించాడు. పేజీలకు పేజీలు డైలాగులు చెప్పడంలో తాత ఎన్టీఆర్ నుంచి ఆ అంశను స్వీకరించాడా.. స్వయంగా ఎన్టీఆరే జూనియర్ ను ఆశీర్వదించాడా అనే విధంగా రాణించాడు.

 

 

ఇండస్ట్రీలో చాలామంది చెప్పే విషయం.. ఎన్టీఆర్ ఓ ఎన్ సైక్లోపీడియా అని. ఎటువంటి విషయాన్నైనా వివరించి చెప్పగలిగే జ్ఞాన సంపత్తి ఎన్టీఆర్ కు ఉంది అని స్టార్ హీరోయిన్ కాజల్ ఓ సందర్భంలో చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావనార్హం. తాతకు ఉన్న విషయ పరిజ్ఞానాన్ని మనవడు కూడా వంశపారంపర్య ఆస్తిగా సంపాదించిన ఎన్టీఆర్ నిజంగా ఆ తాతకు తగ్గ మనవడిగా తెరపై తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: