ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న కరోనా (కోవిడ్19) ఇప్పుడు భారత దేశంలో కూడా వ్యాపించింది. ఇప్పటికే 70 కేసులకు పైగా నమోదు అయ్యాయి.  భారత దేశంలో తోలి కరోనా మరణం నమోదు అయింది. గురువారం కర్నాటక కు చెందిన 76 ఏళ్ల వ్యక్తీ మరణించినట్టు కార్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి బి శ్రీరాములు ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.  ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్నారు.  బయటకు వెళ్తే మాస్క్ లు తప్పకుండా ధరించాలని.. ఎక్కువగా జనాలు ఉన్న చోట జాగ్రత్త తా ఉండాలని.. దగ్గు, తుమ్ములు, జలుబు లాంటివి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

 

ఇక సెలబ్రెటీలు సైతం ఈ కరోనా గురించి తమకు తోచిన రీతిలో వీడియో మెసేజ్ లు పెడుతున్నారు.   కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ నెటిజన్లకు తాజాగా సలహా ఇచ్చారు.  కరచాలనం బదులు సంప్రదాయబద్ధంగా  ‘నమస్తే’ లేదా ‘సలాం’ చెప్పాలని సల్మాన్ ఖాన్ నెటిజన్లకు సూచించారు. నమస్కారం చేయడం, సలాం చేయడం మన సభ్యతా, సంప్రదాయమని, కరోనా వైరస్ తగ్గాక మనం చేతులు కలుపుదాం, కౌగిలించుకుందాం అంటూ సల్మాన్ ఖాన్ నమస్తే పెడుతున్న ఫోలో షేర్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఎంటర్టైన్మెంట్ రంగంపై కరోనా వైరస్  పెను ప్రభావాన్ని చూపుతోంది. షూటింగులు,   ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి.

 

సెలబ్రిటీలు తమ విదేశీ పర్యటనలను, ఈవెంట్లను రద్దు చేసుకోవడమో లేదా వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఈ కరోనా ఎఫెక్ట్ పడిందనే అంటున్నారు అమెరికా, కెనడాల్లో జరగాల్సిన సల్మాన్ ఖాన్  'అప్, క్లోజ్ అండ్ పర్సనల్ విత్ సల్మాన్ ఖాన్' ఈవెంట్లు కూడా వాయిదా  వేసుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఈవెంట్లు ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: