బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టి తర్వాత నటుడుగా మారిన బండ్ల గణేష్ అనూహ్యంగా నిర్మాతగా మారి గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుని సీనియర్ నిర్మాతలని  సైతం ఆశ్చర్యపరిచాడు.  ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్ పట్టీ పీడిస్తుంది.  దేశంలో కొంత కాలంగా ఈ కరోనా వైరస్ ప్రభావం చికెన్, కోడి గుడ్లపై పడింది.  దేశంలో కరోనా కేసులు నమోదవ్వడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. దీనికి కారణం చికెన్ తినడం వల్ల  కరోనా వ్యాపిస్తుందని ముందు నుండి దుష్ప్రచారం జరగటమే. అది నమ్మిన ప్రజలు చికెన్ తినడం మొత్తానికే మానేశారు.

 

దాంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. ఎంత ఘోరంగా మారిందంటే కొంత మంది కోళ్లను ఫ్రీగా పంచి పెట్టారు.  రూ. 20 లకు కిలో చొప్పున అమ్మారు. తెలంగాణలోనూ పౌల్ట్రీ తీవ్రంగా నష్టపోవడంతో మంత్రి కేటీఆర్ స్వయంగా చికెన్ మేళాలో పాల్గొని చికెన్ తినడం వల్ల  ఎలాంటి నష్టం జరగదని మా కుటుంబంలో రోజు చికెన్ తింటామని అన్నారు. అయినా చికెన్ అమ్మకాలు పెరగలేదు. కాగా ఇప్పుడు సీఎం కేసీఆర్ గారే చికెన్ తినడం వల్ల కరోనా రాదని ప్రెస్ మీట్  లో తెలిపారు. 

 

ఈ నేపథ్యంలో పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ అధినేత, ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి  పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్’ బండ్ల గణేశ్ నమస్కారం అంటూ తెలంగాణ సీఎంఓ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు సీఎం కేసీఆర్ ఫొటోను జతపరిచారు. ‘థ్యాంక్యూ సార్’ నమస్కారం అంటూ మరో పోస్ట్  చేసిన బండ్ల గణేశ్, ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియోను జతపరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: