రాజమౌళి ఏవిషయం పై అయినా చాల నిదానంగా స్పందిస్తాడు. ముఖ్యంగా వివాదాల జోలికి దరిదాపులకు కూడ వెళ్ళడు. అలాంటి రాజమౌళి ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి సిసిసి సంస్థ ఇండస్ట్రీ కార్మీకులకు చేస్తున్న సహాయం పై చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన కార్మికులకు అదేవిధంగా చిన్నచిన్న వేషాలు వేసుకుంటూ జీవనం సాగించే ఆర్టిస్టులకు సిసిసి సంస్థ తరపున ఈ కరోనా సమయంలో చిరంజీవి నేతృత్వంలో అందిస్తున్న సహాయం గొప్పది అయినప్పటికీ అది శాశ్విత పరిష్కారం కాదు అంటూ రాజమౌళి కామెంట్ చేసాడు. ఇప్పటికే జక్కన్న సిసిసి సంస్థకు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సహాయ నిధికి అతడి స్థాయిలో చేయతగ్గ సహాయం చేయలేదు అని విమర్శలు వస్తున్న పరిస్థితులలో ఎంతోకొంత తాత్కాలిక సహాయం చేయాలని ప్రయత్నిస్తున్న చిరంజీవి ప్రయత్నాల పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమిటి అంటూ ఇండస్ట్రీలోని మెగా కాంపౌండ్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.


అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించిన పేద కళాకారులకు ప్రభుత్వం పెద్ద మనసుతో శాశ్వత సహాయం చేయాలి అంటూ రాజమౌళి చేసిన సూచన పై కూడ మరికొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు పేదవారికి చేసే సహాయం అంతా రేషన్ కార్డులు ఉన్నవారికి అందుతోంది. 


ఎక్కడక్కడ నుంచో సినిమాలలో అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చి కృష్ణానగర్ లోని చిన్నచిన్న గదులలో ఉంటూ అతి సామాన్య జీవితాన్ని గడిపే ఇండస్ట్రీ పేద కళాకారులకు ప్రభుత్వాలు చెపుతున్న గుర్తింపు పత్రాలు జన్ ధన్ ఎకౌంట్లు ఉండవు అన్న విషయం రాజమౌళికి తెలియదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి ప్రారంభించిన సిసిసి సంస్థ ఉద్దేశాల పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఈ సంస్థ కార్యక్రమాల పై పెదవి విరుస్తున్న మెగా కాంపౌండ్ వ్యతిరేక వర్గం ఇప్పటికే ఇండస్ట్రీలో చాల ఎక్కువగా ఉంది. ఇప్పుడు వారి కామెంట్స్ కు బలం చేకూర్చే విధంగా రాజమౌళి అనుకోకుండా చేసిన కామెంట్స్ మరింత లోతైన చర్చలు సిసిసి కార్యక్రమాల పై జరిగేలా చేస్తున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: