అక్కినేని అమల ఎన్నో ఏళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఆమె నటించిన సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఆ సినిమా తర్వాత మనం సినిమాలో ఓ పాటలో చిన్న సన్నివేశంలో కనిపించింది. మళ్లీ ఆమె సినిమాలు చేసిన దాఖలాలు లేవు. సినిమాలు చేయకపోయినా ఫిట్ నెస్ లో ఖచ్చితత్వం పాటిస్తారు ఆమె. ఫిట్ నెస్ విషయంలో నాగార్జున ఎంత నిబద్ధతతో ఉంటాడో అమల కూడా అంతే. ప్రస్తుతం ఆమె ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

 

 

ఈ వీడియోలో అమల బాడీ వర్కౌట్స్ చేస్తోంది. ప్రొఫెషనల్స్ చేసే వర్కౌట్లు అమల చేయడం విశేషం. అప్పర్ బాడీ వర్కౌట్ కు సంబంధించి మిలిటరీ టైప్ స్టాండింగ్ ప్రెస్ విభాగంలో 25కిలోల బరువులు ఎత్తే వర్కౌట్ చేసింది. లోయర్ బాడీ వర్కౌట్ కు సంబంధించి ఒలింపిక్ స్క్వాట్ విభాగంలో 57 కిలోల బరువులు ఎత్తే వర్కౌట్ చేసింది. రెండింటికి సంబంధించి నాలుగేసి సెట్లు చేస్తున్నానని తన వాల్ లో రాసుకుంది. ఈ వీడియోలో అమల చాలా ఫిట్ గా స్పోర్ట్స్ ఉమెన్ లా ఉంది. అమల వర్కౌట్ పై ఆమె తనయుడు అఖిల్ స్పందిస్తూ.. ‘మై సూపర్ ఉమెన్’ అని పొగుడుతూ కామెంట్ చేశాడు.

 

 

ఈ వీడియోతో నాగార్జున ఫ్యామిలీ మొత్తం ఫిట్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకోవచ్చేమో అన్నట్టు ఉంది. ప్రస్తుతం అమల ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసే అమల  శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినమాలో శర్వాకు తల్లిగా నటిస్తుందని అంటున్నారు. ఈ విషయమై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

For those who wanted to see me train, here is today's workout. In the first video I am doing what is called standing press - or military style standing press and weight is 25 kilos - It’s an upper body workout. The second one is called Olympic squat with 57 kilos. It's a lower body workout. I do 4 sets of 5 squats each. The Stratfit app gives me the warm up numbers and all the work wt sets are 4x5 reps each. (both military press and Olympic squat). NOW u are a pro 😜 #covidworkout #stayhome #stayfit

A post shared by amala Akkineni (@akkineniamala) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: