అప్ప‌ట్లో టాలీవుడ్‌లో కొంద‌రు హీరోయిన్లు హీరోల‌ను త‌మ కను సైగ‌ల‌తో భ‌య‌పెట్టేవార‌ట‌. కొంత మంది హీరోలు వీళ్ళ‌తో న‌టించాలంటేనే భ‌య‌ప‌డేవారంట‌. అది ఎంత పెద్ద హీరో అయినా అరే వీళ్ళు ఎలా చెపితే అలా వినాల్సిందేనంట‌. ఇంత‌కీ వారెవరో ఒక‌సారి చూసేద్దాం.

 

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆమెతో సినిమా అంటే ఆ స్టార్ డ‌మ్ చూసి ఒప్పుకోవ‌ల‌సిందే కాని ఆమె డామినేష‌న్ మాత్రం అంత సామాన్యం కాదు. కంటిచూపుతోనే చంపేస్తా అనే డైలాగ్ జ‌య‌ల‌లిత‌ను చూసే రాసుంటారు అని చెప్పాలి. ఇక రొమాంటిక్ సీన్ల‌లో ఆ హీరోలు హ‌డ‌లిపోతారంట‌. అదేమిటంటే బులిబోనులోకి తోసి న‌వ్వ‌మంటే ఎలా న‌వ్వుతామ‌ని చాటుగా కామెంట్లు కూడా చేసేవారంట అప్ప‌ట్లో హీరోలు. ఆమె అంత గంభీరంగా వ్య‌వ‌హ‌రిస్తూ హీరోల‌ను అదుపు ఆజ్ఞ‌లో పెట్టేవారంట‌.

 

ఇక‌పోతే సావిత్రి చూడ‌టానికి చాలా బోలా మ‌నిషిలాగా ఉంటారావిడ. ఇక సావిత్రితో న‌ట‌న అంటే మాములు విష‌యం కాదు. ఎందుకంటే ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇలాంటి ఈమెతో క‌లిసి మూవీ చేయ‌డం అంటే మాములు విషయం కాదు. ఎన్నో క‌త్తుల‌ను అవ‌లీల‌గా తిప్పిన కాంతారావు లాంటివారే అమ్మో సావిత్రితో సినిమానా అంటూ ఆలోచించాల్సిందే అంటారంట‌. ఎందుకంటే ఆమెతో క‌లిసి చేయ‌క‌లేక‌పోతే ఇరిటేట్ అయిపోతార‌ట‌. ఆ ఇరిటేష‌న్ కాస్త అవ‌మాన భారాన్ని మిగుల్చుతుంద‌ని  భావిస్తుంటారట‌. 

 

ఇక సిల్క్‌స్మిత ఆమె కూడా అంత తేలిక‌యిన యాక్ట‌రస్ కాదు. ఏదో వ్యాంప్ పాత్ర‌ల‌ను వేసుకునేది. అక్క‌డ‌క్క‌డ ఐటెమ్ సాంగ్స్‌తో నెట్టుకొచ్చే పాప అనుకుంటే ఇక అంతే సంగ‌తులు. సిల్క్‌తో పోటీ ప‌డి స్క్రీన్‌ను షేర్ చేసుకోవ‌డం అంటే ఓ శివంగితో క‌లిసి జూలో తిరిగిన‌ట్లే ఉంటుంద‌ట‌. ఏమాత్రం చిన్న తేడా వ‌చ్చినా పంజా విసిరేస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా స‌రే తాను ఇచ్చిన టైమ్ క‌మ్ డేట్స్‌లో వ‌ర్క్ ఫినిష్ చేసుకోవ‌ల్సిందే లేకుంటే లేదు. ఇక చిన్న హీరోల సంగ‌తైతే అస‌లు చెప్ప‌న‌వ‌స‌రం లేదు అంతా హ‌డ‌లిపోయేవారు. ఆమె చేసేది రొమాంటిక్ పాత్ర‌లే అయినా అమె పై చెయ్యి వెయ్యాలంటే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాల్సిందే. మ్యాడం ఇక్క‌డ చేయి వేస్తామ‌ని ప‌ర్మిష‌న్ అడిగి మ‌రీ బిహేవ్ చేసేవారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: