టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరో అయినా మరొకరు అయినా సరే తమ నటన పరంగా బ్యాక్ గ్రౌండ్ ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ తండ్రి కి ఉన్న ఇమేజ్ ని తమకు వాడుకోవాలని లేదా తమ తాతలకు ఉన్న ఇమేజ్ ని తమకు వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని కొందరు హీరోలు  మాత్రం ఆ కోవకు వచ్చే ప్రయత్నం కూడా ఎక్కడా కూడా చేసే అవకాశం ఉండదు అనేది వాస్తవం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే తమకు తాము గా కస్టపడి చేయడమే గాని ఎక్కడా కూడా తండ్రి ఇమేజ్ ని వాడుకునే ప్రయత్నం చేయరు. 

 

అందులో ప్రధానం గా చెప్పుకునే హీరో కళ్యాణ్ రామ్. తనకు బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉన్నా సరే ఎక్కడా కూడా దానిని వాడుకునే ప్రయత్నం చేయలేదు. తన తమ్ముడు ఎన్టీఆర్ స్టార్ హీరో అయినా సరే అతని పేరు ని కూడా ఎక్కడా వాడుకోలేదు కళ్యాణ్ రామ్ అనేది వాస్తవం. ఏ సినిమా చేసినా సరే తనకు తాను గా చేసాడు ప్రయోగాలు చేసాడు. టాలీవుడ్ లో ఎవరూ చేయని సాహసాలు చేసాడు తనకంటూ ఒక గుర్తింపు కోసం కష్టపడిన సందర్భాలు ఉన్నాయి గాని ఎక్కడా కూడా ఇమేజ్ ని వాడుకుని పైకి రావాలి అని చూడలేదు అతను. 

 

వెనుక ఆస్తులు ఉన్నా కుటుంబం పేరు ఉన్నా సరే ఎక్కడా కూడా వారి ఇమేజ్ ని ఇతని కోసం వాడుకున్న సందర్భం లేదు. నిర్మాత గా అయినా హీరో గా అయినా సరే చాలా వరకు తన శక్తి మీద పైకి వచ్చే విధంగా అడుగులు వేయడమే గాని ఎక్కడా కూడా తనకు వాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: