తెలుగు చిత్ర పరిశ్రమలో  హీరో గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జగపతి బాబు . ఆయన హీరో గా చేసిన సినిమాలు ఆయనకు ఎంత పేరు తీసుకొచ్చిన కూడా విలన్ గా చేసిన సినిమాలు మరో రేంజుకు తీసుకెళ్లాయని చెప్పాలి.ఏ పాత్రలో ఆయన నటించినా కూడా ఆ పాత్రలో ఆయన జీవిస్తారు అనే మాట మాత్రం అందరికి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చాలా మంచి పాత్రలు చేసారు. విలన్ గా కూడా చాలా మంచి పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రను వేసుకున్నారు.  

 

 


హీరో కూడా ఆ స్థాయిలో పాత్రలు చేయలేదు.మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా శ్రీమంతుడు సినిమాలో ఆయన చేసిన పాత్ర గాని  మరి కొన్ని సినిమాల్లో ఆయన చేసిన విలన్ పాత్రలు గాని ప్రతీ ఒక్కటి కూడా సినిమాలో హైలెట్ గా ఉంటాయి అనేది వాస్తవం. ఇక హీరోయిన్ కి నాన్నగా, హీరో కి నాన్న గా ఆయన ఎన్నో మంచి పాత్రలు చేసారు అని చెప్పాలి.అలా ఆయన లీడ్ రోల్ లో చేసిన సినిమాలన్నీ కూడా మంచి ఆదరణ పొందిన సినిమాలే కావడం విశేషం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. 

 

 

ఇప్పుడు టాలీవుడ్ లో ఆయన తో సినిమాలు చేయాలనీ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.హీరోగా ఆయన చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు మంచి హిట్ టాక్ ను కూడా అందుకున్నాయి. అగ్ర నటుడిగా ఆయన ఎన్నో కీలక పాత్రల్లో కనిపించారు.అందుకే జగపతి బాబు తో కలిసి సినిమాలు చేయడానికి చాలా మంది యువ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: