ఇప్పుడు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు సినిమాల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు మాత్రం భయపడే విధంగా ఉంది పరిస్థితి అనేది వాస్తవం. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు కూడా సినిమాల విషయంలో జాగ్రత్తలు పడుతూ వస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రయోగాల విషయంలో ఏ మాత్రం భయపడని రామ్ చరణ్ అయితే ఇప్పుడు సినిమాల్లో పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా భయపడటం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. 

 

అవును అతని లో అసలు ఏ మాత్రం కూడా భయం అనేది లేదు అని స్వేచ్చగా పెట్టుబడి  పెట్టడానికి రెడీ అయ్యాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల అతను తన తండ్రి తో ఒక భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అలాగే మహేష్ బాబు తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అని అసమాచారం. ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి అందరూ భయపడుతుంటే రామ్ చరణ్ మాత్రం చాలా వరకు స్వేచ్చగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియడం లేదు. 

 

ఇక తన ఫ్రెండ్ రానా తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ ని అతను లైన్ లో పెట్టాడు అని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే అతను సైన్ కూడా చేసాడు అని తెలుస్తుంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయడానికి గానూ అతను బాగా కష్టపడుతున్నాడు అని టాలీవుడ్ లో టాక్ ఎక్కువగా వినపడుతుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: