హీరో రామ్ కి ఇప్పుడు మంచి హిట్లు వస్తున్నాయనే చెప్పాలి. అలానే మంచి క్రేజ్ కూడా తనకి లభించింది. యువ కథానాయకుడు రామ్ కి  'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా కూడా మంచి పేరు తెచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ తర్వాత 'గరుడవేగ' దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో ఒక సినిమాను తీస్తున్నట్టు చెప్పడం కూడా మనకి తెలుసు. అలానే ఈ చిత్రాన్నినిర్మించడానికి  రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్  ముందుకు రావడం కూడా తెలిసినదే. అన్ని సిద్ధమైనా కూడా  సినిమా సెట్స్ మీదికి వెళ్ళలేదు. ప్రారంభం లోనే అంత ఆగి పోయింది.

అలా ఆగిపోవడానికి కారణం  బడ్జెట్ సమస్యలే అని అప్పట్లో వార్తలు వినపడ్డాయి. అలానే రామ్‌తో అతను చేయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైతం బడ్జెట్ లెక్కలు ఘనంగా ఉండటంతో ఇది వర్కవుట్ కాదని రవికిషోర్ పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి. ఇది ఇలా ఉండగా  'గరుడవేగ'ను మాత్రం భారీ బడ్జెట్లో రూపొందించాడు  ప్రవీణ్. ఆ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీనికి కారణం ఓవర్ బడ్జెట్ పెట్టేయడమే. అలా ప్రవీణ్ అప్పటి నుండి  రెండేళ్లు సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు.

పుల్లెల గోపీచంద్ బయోపిక్ తీస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ అది కూడా  కుదరలేదు. ఇక అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. సెట్స్ మీదికి  ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఇలా అతని ప్లాన్స్ అన్ని ప్రారంభం లోనే ఢమాల్ అయిపోయాయి.  ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు కానీ.... రామ్‌, ప్రవీణ్ కాంబినేషన్లో ఇంతకుముందు సెట్ అయిన ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రామ్  'ఇస్మార్ట్ శంకర్'తో అతను బ్లాక్‌బస్టర్ విజయాన్నందుకున్నాడు. ఈ సినిమాతో అతడి మార్కెట్ ఎంతో పెరిగింది అన్న సంగతి తెలిసినదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: