తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరంజీవి మన మెగాస్టార్. సినీ జీవితంలో ఆయన చూడని ఎత్తు పల్లాలు లేవు. ఈరోజు ఎంతోమంది ఆయన స్ఫూర్తితోనే తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు అయ్యారు. 90sలో సుప్రీం హీరో వేసిన స్టెప్పులకు బక్షాఫీస్ షేక్ అయ్యేది. కేవలం చిరు వేసిన స్టెప్పులు చూడటానికే థియేటర్స్ దగ్గర జనాలు బారులు తీరేవారు. సుమారు 4 దశాబ్దాల క్రితం మొదలైన మన మెగాస్టార్ సినీ ప్రస్థానం నేటికీ ఇంకా కొనసాగుతోంది.

మధ్యలో కొంతకాలం రాజకీయాల పరంగా సినిమాలకు కొంత కాలం దూరమైనప్పటికీ పెద్ద తేడా తెలియకుండా 150 సినిమాతో మళ్ళీ రికార్డులు తిరగ రాయడం స్టార్ట్ చేశారు చిరు. నేటికి మెగాస్టార్ వయస్సు 65 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి కుర్ర హీరోలతో ఢీకొనడానికి ఎంతమాత్రం వెన్ను చూపరు. దానికి ఉదాహరణే మొన్న రిలీజైన బయోపిక్ చిత్రం సైరా నరసింహారెడ్డి. అందులో చిరు చేసిన ఫైట్స్ తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే మెగా వారసుడు అయినటువంటి రాంచరణ్ అడపా దడపా మన మెగాస్టార్ సినిమాలలో మెరుస్తూ ఉంటాడు. మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతో మంది క్యూలో వుంటారు. అలాంటిది వారి వారసుడికి ఆ అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాడు చెప్పండి. అందుకే అవకాశం వచ్చిందే తడువుగా తన తండ్రి పక్కన నటించడానికి సిద్ధంగా ఉంటాడు మన చరణ్.

అయితే, అక్కడే వచ్చింది అసలు చిక్కు. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపొతే మన మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసినదే. అలాగే ఇందులో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ నటిస్తున్న సంగతి కూడా తెలిసినదే. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. మరి అందరూ అనుకున్నట్టు లెక్క తప్పుతుందా లేదంటే అందరి అంచనాలు దాటి రికార్డులు తిరగరాస్తుందా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: