టాలీవుడ్ లో పూజాహేగ్దే  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలు అనగానే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఆమెకు కాస్త మన తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పూజాహెగ్డే చాలా వరకు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆమె రెమ్యునరేషన్ విషయంలో అసలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఇటీవలి కాలంలో రెమ్యూనరేషన్ విషయంలో పూజ మరీ భారీగా డిమాండ్ చేయడంతో చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. హీరోలు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది హీరోలు ఆమెను పక్కన పెట్టారని అంటున్నారు. అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ ని భారీగా తగ్గించిందని సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి ఒక ముందడుగు కూడా పడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఏది  ఎలా ఉన్నా సరే ఇప్పుడు పూజ మాత్రం కాస్త తెలుగులో హాట్ టాపిక్ అయింది. అటు బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఆమె భారీగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమెను కొంతమంది అక్కడ కూడా పక్కన పెడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే మన తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. ఈ మూడు సినిమాల తర్వాత ఏ సినిమా చేస్తుంది ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక ఆమె నటించిన ఒక చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: