అక్కినేని కోడలు సమంత తన మల్టీ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా యాడ్స్ తో పాటుగా ఈమధ్య స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. సమంత బిగ్ బాస్ హోస్ట్ గా దసరా స్పెషల్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది. దసరా ఎపిసోడ్ అదిరిపోగా కచ్చితంగా రికార్డ్ టి.ఆర్.పి తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇదిలాఉంటే బిగ్ బాస్ హోస్ట్ గా సమంత కనిపించి తన పాపులారిటీ రేంజ్ ఏంటన్నది చూపించింది. తెలుగు పర్ఫెక్ట్ గా రాకపోయినా సరే మామ ఇచ్చిన బాధ్యతను సమంత న్యాయం చేసిందనే చెప్పాలి. బిగ్ బాస్ హోస్ట్ గా సమంతని చూసిన ఫ్యాన్స్ ఆమె ఇక భేషుగ్గా స్మాల్ స్క్రీన్ పై షోలు కూడా చేసేయొచ్చని అంటున్నారు. సమంత క్రేజ్ స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్ అవుతుంది.

బిగ్ బాస్ కోసం సమంత 5 ఎపిసోడ్స్ డీల్ సెట్ చేసుకుందట. ఇందుకుగాను ఆమెకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ పై కూడా సమంత తన సత్తా చాటాలని చూస్తుంది. మరి ఆమె కోసం స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. జాను తర్వాత నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయని సమంత త్వరలో సర్ ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు. సమంత తన టాలెంట్ తో అందరిని మెప్పిస్తుంది. ఒకవేళ ఆమె స్మాల్ స్క్రీన్ పై షో చేసినా సరే అది కూడా సూపర్ హిట్టే అవుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సమంత హోస్టింగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆమె స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: