తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు నటీ నటులు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ.. అవేవి ఉపయోగించుకోకుండా తమ సొంత టాలెంట్ తో ఇండ్రస్టీ లో నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అలాంటి వారిలో అలనాటి నటి కనిక ఒకరు..ఈమె తెలుగులో విజయబాపినీడు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన వాలుజడ తోలుబెల్టు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైంది.కనిక తమిళ తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించింది.

ఈ విషయం పక్కన పెడితే.. ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా మనందరికీ బాగా తెలిసిందే.. ఈ అమ్మాయి మరెవరో కాదు మన రఘుపతి వెంకయ్య నాయుడు గారి గారాల మనవరాలు..వెంకయ్య నాయుడు గారికి దేవిగా రాణి అనే కూతురు ఉండేది.. ఈమె కూడా ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో కొనసాగింది.. అయితే కొన్నాళ్ల తర్వాత ఈమె దేవదాసు అనే అతన్ని పెళ్లి చేసుకుంది.. వీళ్ళకి జన్మించిన కూతురే కనకమహాలక్ష్మి.. అందరూ ఈమెని కనిక అని పిలుస్తారు.. తన తల్లి లాగే సినీ అరంగేట్రం చేసిన ఈ హీరోయిన్..తమిళంలో మొదటి సినిమా సాంప్రదాయ నృత్యమైన కరగటం ఆధారంగా తీసిన కరకకట్టాకరణ్ అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించింది ఆ తర్వాత తను వెనుదిరిగి చూడకుండా చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధిస్తూ రఘుపతి వెంకయ్య నాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి నటిగా గుర్తింపు పొందుతూ తల్లికి తగ్గ తనయురాలుగా గుర్తింపును సాధించింది.

ఆవిడ తమిళంలో అర్జున్, శరత్ కుమార్ లాంటి హీరోలతో నటించి మంచి గుర్తింపును సాధించింది అలాగే మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ యాక్టర్స్ తో నటించి తనకంటూ మలయాళంలో కూడా మంచి గుర్తింపు సాధించింది ఆమె హీరోయిన్ గా కొనసాగుతున్న అప్పుడే అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ముత్తుకుమార్ నీ కాలిఫోర్నియాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు ఆవిడ చెప్పారు.. కానీ అది జరిగిన పదిహేను రోజులకి ఒక సినిమా ఫైనాన్షియర్ తన భర్తని కిడ్నాప్ చేశారని చెప్పారు అయితే దీంతో వాళ్ళ నాన్న తన కూతురికి ఎవరితో పెళ్లి కాలేదని తనకు మతిస్థిమితం సరిగా ఉండటం లేదని చెప్పాడు.ఆమె తల్లి దేవిక చనిపోయిన తర్వాత ఆమె సినిమాలో నటించడం మానేశారు దాంతో చాలా రోజుల వరకు ఎవరికీ కనిపించకపోవడంతో తను క్యాన్సర్ తో చనిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి దాంతో కనిక మీడియా ముందుకు వచ్చి నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఎందుకిలా ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారు అని మీడియా వాళ్లకి గట్టిగా సమాధానం చెప్పి .ఆవిడకి మతిస్థిమితం సరిగా ఉండటం లేదు అని తెలిసినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: