టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.ఇక ఒక పక్కరాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ తరుణంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు.ఇక వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.


కరోనా వలన పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన పవర్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇక సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..దాంతో సినిమాకి మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయని చెప్పాలి.వకీల్ సాబ్' చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.


మొదటి రోజు ఈ చిత్రం రికార్డు స్థాయిలో 36.46 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 53.39 కోట్ల షేర్ ను రాబట్టాలి.హిట్ టాక్ తో భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది కాని బ్రేక్ ఈవెన్ అయ్యి బయ్యార్లకు లాభాలను తీసుకొస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఇక ఈ సినిమా ఎంతమేరకు లాభాలను తీసుకొస్తుందో. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: